ఢిల్లీ కార్పోరేషన్లో ఆప్ అధికారం కష్టమేనా ? బీజేపీ గేమ్ మొదలు ! ఏం జరగబోతోంది ?

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఇవాళ జయకేతనం ఎగురవేసిన అధికార పార్టీ ఆప్ కు ఆ సంతోషం ఎక్కువ సేపు మిగిలేలా కనిపించడం లేదు. 250 సీట్లున్న ఎంసీడీలో 134 సీట్లు సాధించి అధికారానికి కావాల్సిన 126 సీట్ల మ్యాజిక్ మార్క్ అధిగమించిన ఆప్ కు ఇప్పుడు 104 సీట్లు గెల్చుకున్న బీజేపీ నుంచి ప్రమాదం పొంచి ఉంది. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన చట్టమే.

ఢిల్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఆప్ కు వాస్తవంగా 126 వార్డుల్లో గెలిస్తే సరిపోతుంది. కానీ 134 సీట్లు గెల్చుకుంది. అదే బీజేపీ 104 సీట్లకే పరిమితమైంది. దీంతో ఇప్పుడు ఫిరాయింపుల్ని ప్రోత్సహించడంతో పాటు కేంద్రం నామినేట్ చేసి 12 మంది కౌన్సిలర్ల సాయంతో ఆప్ సాధించిన ఈ మెజార్టీని అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

after aap victory, bjp start playing foul game to capture power in mcd with councellors

అలాగే రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంటు తరహాలో ఎంసీడీలో ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. దీంతో ఆప్ తమ కౌన్సిలర్లకు విప్ జారీ చేసే అవకాశం కూడా ఉండదు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఫిరాయించే కౌన్సిలర్లు తమ పార్టీ మారాల్సిన అవసరం కూడా లేదు. దీంతో తమ పార్టీలో ఉంటూనే బీజేపీ మేయర్ అభ్యర్ధికి మద్దతిచ్చే అవకాశాలున్నాయి. ఇందుకోసం బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+