సాయం చేయండి, అల్లా తర్వాత మీరే మా ఆశ: సుష్మాకు పాక్ బాలుడి మొర
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ, భారత్‌లో చికిత్స తీసుకోవాలని భావించిన మరో పాకిస్తాన్ బాలుడికి మెడికల్ వీసా ఇవ్వాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నిర్ణయించారు.
ఇస్లామాబాద్: ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ, భారత్‌లో చికిత్స తీసుకోవాలని భావించిన మరో పాకిస్తాన్ బాలుడికి మెడికల్ వీసా ఇవ్వాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నిర్ణయించారు.
సుష్మా ఎంత బిజీగా ఉన్నా ఆపదలో ఉన్నవారికి కావాల్సిన సహాయాన్ని చేసి తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా ఓ పాకిస్తాన్ బాలుడు కూడా వేడుకున్నాడు.

'అల్లా తర్వాత మీరే మాకు చివరి ఆశ. భారత్‌లో వైద్యం చేయించుకునేందుకు మా బంధువు షాజైబ్ ఇక్బాల్‌కి మెడికల్ వీసా ఇప్పించండి' అని పాకిస్థాన్‌కి చెందిన ఓ వ్యక్తి సుష్మకు ట్వీట్ చేశారు. దీనిపై సుష్మా వెంటనే స్పందించారు.
'మీ ఆశను వమ్ము కానివ్వం. మీకు వెంటనే వీసా మంజూరు చేస్తామ'ని సుష్మా స్పందించారు.
పాక్‌లో కాలేయ మార్పిడి చేయించుకుని తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైన సాజిదా అనే మహిళ భారత్‌లో అత్యవసర వైద్యం కోసం మెడికల్ వీసా ఇప్పించాలని కోరగా సుష్మాస్వరాజ్ వెంటనే స్పందించి ఆదుకుంటామని చెప్పారు. అలాగే కిష్వార్ సుల్తానా అనే వ్యక్తికి కూడా నోయిడాలో కాలేయ మార్పిడి చేయించుకోవడానికి మెడికల్ వీసా మంజూరు చేశారు.












Click it and Unblock the Notifications