అనంత్ అంబానీ తర్వాత.. సన్నబడిన ఫడ్నవీస్

ముంబై: స్థూలకాయం సమస్య నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో తనయుడు అనంత్ అంబానీ సులువుగా బయటపడ్డాడు. చాలా లావుగా కనిపించిన అతను.. ఇటీవల సన్న బడటం సోషల్ మీడియాలో చర్చనీయాశంగా మారింది.

అనంత్ అంబానీలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా బరువు తగ్గారు. ఫడ్నవీస్ మూడు నెలల్లో 18 కిలోలు తగ్గారు. బరువు తగ్గక ముందు బొద్దుగా కనిపించిన ఫడ్నవీస్.. బరువు తగ్గిన తర్వాత స్లిమ్‌‍గా కనిపిస్తున్నారు. సోమవారం ఉదయం ఓ టీవీ ఛానల్ ఆయన బొద్దుగా ఉన్న పాత చిత్రాన్ని, సన్నబడిన తాజా చిత్రాన్ని ప్రసారం చేసింది.

ముఖ్యంగా అనంత్ అంబానీ సన్నబడిన తీరు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. గతంలో అధిక బరువుతో కొండలా కనిపించే ఆయన ఇప్పుడు ఎంతో సన్నబడి స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు. అనంత్ అంబానీ కేవలం 18 నెలల్లో సన్నబడ్డాడు.

After Anant Ambani, now Maharashtra CM Devendra Fadnavis loses 18 kg in three months

తద్వారా మనదేశంలో స్థూలకాయంతో బాధపడుతున్న వేలాది మంది యువతకు అనంత్ ఇప్పుడు ఆదర్శనీయుడయ్యాడు. అంతేకాదు కేవలం 18 నెలల కాలంలో 108 కిలోల బరువును తగ్గాడు. ఇంత మార్పు ఎలా సాధ్యమైందబ్బ అని గుసగుసలాడుకుంటున్నారు.

ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకొని దానిని పాటించడం ద్వారా సన్నబడవచ్చు. టెక్నాలజీని వాడుకోవాలి. ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినాలి. రోజు యోగా, ఎక్సర్ సైజులు చేయాలి. నడవాలి. వైద్యుల సూచనలు పాటించాలి. అనంత్ అంబానీ ఇవన్నీ పాటించి బరువు తగ్గాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+