ఒడిశాలో ఇవాళ మరో రైలు ప్రమాదం..మూడురైళ్ల విషాదం మర్చిపోకముందే..

ఒడిశాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా, గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పడం, ఢీకొన్న ఘటన మర్చిపోకముందే ఇవాళ మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ఇవాళ రాష్ట్రంలో మరో గూడ్స్ రైలు ప్రయాణం మధ్యలో పట్టాలు తప్పింది. దీంతో రైల్వే అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మూడు రోజుల క్రితమే మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో భారీ సంఖ్యలో మృతులు, క్షతగాత్రులు కావడంతో షాక్ లో ఉన్న అధికారులకు ఇవాళ గూడ్స్ రైలు ఘటన ఉలిక్కిపడేలా చేసింది.

ఒడిశాలోని బార్‌ఘర్ జిల్లాలోని సంబర్ధరన్ సమీపంలో ఇవాళ సున్నపురాయితో వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన పలు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఘటన జరిగిన సమయంలో రైలు బర్‌గఢ్‌ నుంచి డుంగురి వెళ్తోంది. మార్గమధ్యంలో ట్రాక్ సమస్యల కారణంగా రైలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

after balasore incident, another train derails in odisha

తాజాగా రైలు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి బర్గర్ జిల్లా మెంధపాలి సమీపంలోని ఫ్యాక్టరీ ఆవరణలో ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ నడుపుతున్న గూడ్స్ రైలుకు చెందిన కొన్ని వ్యాగన్లు పట్టాలు తప్పాయని ఇందులో రైల్వే పాత్ర ఏమీ లేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే పేర్కొంది. ఇది పూర్తిగా ప్రైవేట్ సిమెంట్ కంపెనీకి చెందిన నారో గేజ్ సైడింగ్ అని, రోలింగ్ స్టాక్, ఇంజిన్, వ్యాగన్లు, రైలు ట్రాక్‌లు (నారో గేజ్) సహా అన్ని మౌలిక సదుపాయాలను కంపెనీ నిర్వహిస్తోందని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది.

అయితే బాలాసోర్ లో పెను దుర్ఘటన నేపథ్యంలో అదే రాష్ట్రంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో అధికారులతో పాటు సామాన్యులు కూడా ఏం జరిగిందో అని ఆందోళన చెందారు. అయితే ఆ తర్వాత ఈ ఘటనలో ఎలాంటి ప్రాణష్టం లేదని, అలాగే ఇది ప్రైవేట్ గూడ్స్ రైలుగా గుర్తించడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+