ఘోరం: ఆకలిని తట్టుకోలేక పురుగుల మందు తాగిన చిన్నారులు

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో దారుణం జరిగింది. ఆకలికి తట్టుకోలేక చిన్నారులు పురుగుల మందు తాగారు. ఇది డిసెంబర్ 31వ తేదీన జరిగింది. ఈ విషయం తెలిసిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

వారం క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో కొందరు గిరిజనులకు రేషన్ దుకాణాల నుంచి సరకులు అందలేదు. దీంతో ఆయా కుటుంబాలు ఆకలితోనే ఉంటున్నాయి.

After being denied food at ration shop, child drinks insecticide due to hunger in Madhya Pradesh

ఈ క్రమంలో ఆ కుటుంబాలలోని చిన్నారులు ఆకలికి తట్టుకోలేక పురుగుల మందు తాగారు. వెంటనే చిన్నారులను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ సమాచారాన్ని బయటకు రానీయలేదు.

స్థానిక మీడియా ద్వారా విషయం వెలుగు చూసింది. చిన్నారుల వయసు తెలియాల్సి ఉంది. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఎన్‌సీపీసీఆర్ అధికారులను ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+