బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru doctor : ట్రాఫిక్ లో కారు చిక్కుకున్నా-వదిలేసి 3 కి.మీ నడిచి వెళ్లి సర్జరీ చేసిన డాక్టర్

|
Google Oneindia TeluguNews

బెంగళూరులో తాజాగా ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆగస్టు 30న నగరంలోని మారత్పల్లి స్ట్రెచ్ సర్జాపూర్ లో భారీ ట్రాఫిక్ కారణంగా వాహనాలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. అందులో పలువురు వృత్తినిపుణులు కూడా చిక్కుకుపోయారు. ఈ ట్రాఫిక్ లోనే ఓ డాక్టర్ కూడా చిక్కుకుపోయారు. కానీ ఆయన వెంటనే ఆస్పత్రికి చేరుకుని ఓ మధ్యవయస్సురాలైన మహిళకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉంది. ఆయన వెళ్లకపోతే ఆ శస్త్రచికిత్స జరగదు. మరో ప్రత్యామ్నాయం లేదు.

దీంతో ఆ డాక్టర్ ట్రాఫిక్ లో చిక్కుకున్న తన కారును అక్కడే వదిలేసి రోడ్డుపై నడక ప్రారంభించారు. ఇలా మూడు కిలోమీటర్లు నడిస్తే ఆస్పత్రికి చేరుకోవచ్చు. దీంతో ఆయన నడవడం మొదలుపెట్టారు. అయినా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఆలస్యమయ్యేలా ఉంది. దీంతో కాస్త వేగంగా నడుస్తున్నారు. ఏదోలా ఆస్పత్రికి చేరుకున్నారు. చివరికి సకాలంలో ఆస్పత్రిలోకి వెళ్లి నేరుగా ఆపరేషన్ రూమ్ లోకి వెళ్లిపోయారు. తనకోసం ఎదురుచూస్తున్న సిబ్బందితో కలిసి వెంటనే ఆ వృద్ధురాలికి విజయవంతంగా ఆపరేషన్ కూడా పూర్తి చేసేశారు. హమ్మయ్య అనుకున్నారు.

after car struck in traffic, bengaluru doctor walks 3km to hospital to perform surgery

ఆ తర్వాత పదిరోజులకు ఆయన నడిచిన వీడియోను ఎవరో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో అది కాస్తా వైరల్ అయింది. చివరికి ఆ వృత్తి నిబద్ధత కలిగిన డాక్టర్ ఎవరాని ఆరా తీస్తే ... బెంగళూరులో సర్జాపూర్‌లోని మణిపాల్‌ హాస్పిటల్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్‌ డాక్టర్‌ గోవింద్‌ నందకుమార్‌ అని తెలిసింది. దీంతో ఇప్పుడు ట్విట్టర్ లో ఆయన చూపిన వృత్తి నిబద్ధతను పొగుడుతూ ఆయన ఆస్పత్రికి నడిచి వెళ్తున్న వీడియోను వందలాది మంది షేర్ చేస్తున్నారు. దీంతో ఈ డాక్టర్ నందకుమార్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

English summary
even his car stuck in traffic, a bengaluru doctor walked 3km to hospital to perform surgery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X