• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అద్దె బాకీ చెల్లింపు.. లక్నోకు మకాం మార్పు.. మోదీ సర్కార్ నోటీసులతో ప్రియాంక వ్యూహాత్మక అడుగు..

|

ప్రత్యర్థుల జిత్తులనే ఇవతలివాళ్లకు ఆయుధాలుగా మలుచుకున్న సందర్భాలు రాజకీయాల్లో పరిపాటి. అయితే బడా నేతల విషయంలో ఇలాంటివి బాహాటంగా జరగడం అరుదనే చెప్పాలి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రాకు షాకిస్తూ ఢిల్లీలో ఆమె నివసిస్తోన్న 35, లోథీ ఎస్టేట్ బంగళాను ఖాళీ చేయాల్సిందిగా మోదీ సర్కార్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. గతంలోనే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) భద్రత కోల్పోయిన ప్రియాంకకు ఆ భవంతిలో ఉండే అర్హత లేదని, ఆగస్టు 1 తర్వాత కూడా అదే ఇంట్లో ఉంటే చర్యలు తప్పవని కేంద్ర హౌజింగ్, అర్బన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

సాయిరెడ్డికి సీఎం జగన్ షాకిచ్చారా?.. వైసీపీలో ఎంపీ బాధ్యతలకు భారీ కోత.. సజ్జలకు పెద్ద పీట..

ఆన్ లైన్ ద్వారా పేమెంట్

ఆన్ లైన్ ద్వారా పేమెంట్

ఈ మేరకు నోటీసులు అందిన వెంటనే ప్రియాంక వేగంగా స్పందించారు. గంటల వ్యవధిలోనే లోథీ బంగళా అద్దె బాకీ మొత్తాన్ని సర్కారుకు చెల్లించేశారు. ‘‘ఆన్ లైన్ పేమెంట్ ద్వారా ప్రియాంక తన నివాసానికి సంబంధించిన అద్దె బాకీ రూ. 3,46,677 చెల్లించారు. జూన్ 30 నాటికి ఆమె పేరిట బకాయిలేవీ లేవు. అయినాసరే ఆమె ఆ ఇంటిని ఖాళీ చేయాల్సిందే'' అని హౌజింగ్ శాఖ అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు. నోటీసుల వ్యవహారాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని ప్రియాంక భావిస్తున్నట్లు తెలిసింది.

 ఫోకస్ మొత్తం ఉత్తరప్రదేశ్

ఫోకస్ మొత్తం ఉత్తరప్రదేశ్

గతేడాది సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ హోదాతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ తన ఫోకస్ మొత్తం ఉత్తరప్రదేశ్ పై నిలిపారు. ఈస్ట్ యూపీ ఇన్ చార్జిగా విస్తృత పర్యటనలు చేశారు. జనంలోనూ ఆమెకు ఆదరణ లభించింది. ప్రియాంక ప్రచార శైలి చూసిన ప్రత్యర్థులు, విశ్లేషకులు.. ‘‘ఆమె లోక్ సభ ఎన్నికల కోసం కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ బేస్ సెట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు..''అని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో బంగళా ఖాళీ చేసిన తర్వాత ప్రియాంక తన మకాంను లక్నోకు మార్చుకోనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

 బంగళా ఖాళీ చేయాలి

బంగళా ఖాళీ చేయాలి

గడిచిన ఏడాది కాలంగా ప్రతి వారంలో కనీసం ఒకసారైనా యూపీకి వెళ్లొచ్చే ప్రియాంక.. కరోనా కారణంగా మార్చి నుంచి ఇల్లు కదల్లేదు. ఇప్పుడు ఆగస్టు 1 నాటికి బంగళా ఖాళీ చేయాల్సి రావడం ఒక అవకాశంగానే ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ ఎంపీ సీట్లు సాధించిన పార్టీనే ఢిల్లీలో అధికారం కైవసం చేసుకుంటుందన్న సెంటిమెంట్ తెలిసిందే. అలాంటి యూపీలో 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో సత్తాచాటుకుంటే, 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ ప్రభావం చూపొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఎత్తుగడలన్నీ ఫలించాలంటే ప్రియాంక ఫుల్ టైమ్ యూపీలోనే ఉండాలని, ఆ మేరకే నిర్ణయం తీసుకోబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మాయవతి బీజేపీకి మద్దతు

మాయవతి బీజేపీకి మద్దతు

యూపీలో బీజేపీ బలంగా పాతుకుపోగా.. సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీల బంధం ఎన్నికల తర్వాత వీగిపోయింది. తాజాగా చైనాతో సరిహద్దు వివాదం అంశంలో మాయవతి బీజేపీకి మద్దతు పలకడం, కాంగ్రెస్ గత తప్పిదాల వల్లే దేశం దుస్థితిలోకి దిగజారిందని విమర్శించడాన్ని బట్టి, అటు ప్రియాంక.. భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్లతోనూ నిరంతరం చర్చలు జరుపుతుండటాన్ని బట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పొత్తులు ఊహించొచ్చని అనలిస్టులు అంటున్నారు.

English summary
After receiving notice from the Centre to vacate the bungalow at Lodhi Estate in Delhi, Congress general secretary Priyanka Gandhi has cleared her dues of Rs 3.46 lakh. and now planning to shift to Uttar Pradesh and will stay in a bungalow in Lucknow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more