వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేడీఎస్ మంత్రులు కూడా రాజీనామా : రెబల్ ఎమ్మెల్యేలకు బెర్త్ అంటూ ఆఫర్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : గడియ గడియకు కర్ణాటక రాజకీయం మారుతుంది. ఇప్పటికే 22 మంది కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేయగా, జేడీఎస్ మినిస్టర్సే మిగిలారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వారితో కూడా రాజీనామా చేయించాలని సంకీర్ణ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రసకందాయంలో పడిన కర్నాటకీయానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అసంతృప్త స్వరం వినిపిస్తున్న ఎమ్మెల్యేలకు క్యాబినెట్ బెర్త్ ఇచ్చి శాంతపరుస్తారు. దీంతో సమస్యకు పరిష్కారం లభించినట్టేనని జేడీఎస్, కాంగ్రెస్ శ్రేణులు ధీమాతో ఉన్నాయి.

రాజీనామాల పర్వం ..
తమను పట్టించుకోవడం లేదని 13 మంది తిరుగుబాటు ఎగరేసి .. ముంబై హోటల్‌లో బస చేసిన సంగతి తెలిసిందే. దీంతో సంకీర్ణ సర్కార్ చక చకా పావులు కదుపుతుంది. తొలుత 22 మంది కాంగ్రెస్ మంత్రుల చేత రాజీనామా చేయించి .. వ్యుహాత్మకంగా వ్యవహరించింది. తర్వాత జేడీఎస్ మంత్రులతో రాజీనామా చేయిస్తామని ప్రకటించింది. దీంతో దాదాపు కర్ణాటక క్యాబినెట్ అంతా రాజీనామా బాట పడుతుంది. తర్వాత మంత్రివర్గాన్ని పునర్ నిర్మిస్తారు.

After Congress, now all JDS ministers resign, cabinet reshuffle soon

అప్పుడు తిరుగుబాటు వేసిన నేతలతో మంత్రివర్గం కొలువుదీరుతుంది. ఈ మేరకు వారికి సంకేతాలు కూడా పంపారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు ముంబై నుంచి కర్ణాటక చేరుకుంటారని జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు అంచనా వేశారు.

విశ్వ ప్రయత్నాలు ...
కర్ణాటకలో కుమారస్వామి సర్కార్ కొలువుదీరి 13 నెలలు అవుతుంది. సంకీర్ణ ప్రభుత్వంలో కుమారస్వామి చాలా ఇబ్బంది పడ్డారు. బాహాటంగా మీడియా ముఖంగా అసంతృప్తి వెల్లగక్కిన సందర్భాలు ఉన్నాయి. ఆయనతోపాటు మిగతా నేతలు కూడా అసంతృప్తి ఉన్నారు. అదనుచూసి తమ ధిక్కార స్వరాన్ని వినిపించారు. దీంతో డిఫెన్స్‌లో పడిపోయిన స్వామి సర్కార్ .. వారిని కాపాడుకునేందుకు శతవిధలా ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, జేడీఎస్ మంత్రుల రాజీనామా సమస్యకు పరిష్కారం అని భావించి ఆ దిశగా అడుగులు వేసింది.

అంతేకాదు జేడీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ విశ్వనాత్, ఎమ్మెల్యే గోపాలయ్యకు మంత్రి పదవులు, ఎమ్మెల్యే నారాయణ్ గౌడకు బోర్డు చైర్మన్ పదవీ ఇస్తామని హామీనిచ్చారు. కానీ వారు మిగతా పదవుల కోసం పేచీ పడటంతో చర్చల ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. మరోవైపు విశ్వనాథ్ రాజీనామాకు పర్యాటక శాఖ మంత్రి సారా మహేశ్ కారణమని చాలా మంది ఎమ్మెల్యేలు ఆరోపించారు.

English summary
as the Karnataka political crisis enters its third day on Monday, a resolution seems like a distant goal for Congress and Janata Dal (Secular). Late on Sunday night, Karnataka Chief Minister HD Kumaraswamy went into a huddle with the coalition leaders in a last ditch attempt to save his 13-month-old alliance government. According to sources, the meeting concluded without any favourable outcome. According to sources, the coalition leaders agreed to offer ministerial berths to former JD (S) state chief H Vishwanath and MLA Gopalaiah, and board chairman post to MLA Narayan Gowda, but they remained adamant. In the late night meeting, most MLAs blamed Tourism Minister Sa Ra Mahesh for Vishwanath’s resignation, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X