సామాన్యుడికి మరో షాక్: పెరిగిన వంటగ్యాస్ ధరలు
న్యూఢిల్లీ: ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి వంటగ్యాస్ ధరల పెరుగుదల రూపంలో మరో షాక్ తగిలింది. సబ్సిడీ వంటగ్యాస్‌పై రూ.2.34, సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్‌పై రూ. 48పెంచుతూ చమురు సంస్థలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి.
ఈ పెరుగుదలతో న్యూఢిల్లీలో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 493.55, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.698.50కి చేరుకుంది. కోల్‌కతాలో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.723.50, ముంబైలో రూ.671.50, చెన్నైలో 712.50గా ఉంది.

వంట గ్యాస్ ధరలు పెరగబోవని, రూ.100 వరకు తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం, సహజవనరుల మంత్రిత్వ శాఖ పేర్కొన్న నెల రోజులకే చమురు సంస్థలు ఈ విధంగా ధరలు పెంచడం గమనార్హం. సబ్సిడీ కింద ప్రతి ఏడాది ఇంటికి 12 చొప్పున వంటగ్యాస్ సిలిండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇవి కాకుండా కావాలంటే మాత్రం మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సిందే.












Click it and Unblock the Notifications