జిన్ పింగ్‌పై చైనా ప్రజల ఆగ్రహం.. గాల్వాన్‌లో హింస తర్వాత మళ్లీ చర్చలు.. భారత్ కొత్త స్ట్రాటజీ

గడిచిన ఆరు వారాలుగా భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత కొనసాగుతున్నది. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో గత వారం చైనా సైనికులు.. 20 మంది భారత జవాన్లను కిరాతకంగా చంపేయడం, మరో 76 మందిని తీవ్రంగా గాయపర్చిన తర్వాత పరిస్థితులు జఠిలంగా మారాయి. అవి ఇంకా దిగజారకుండా, తిరిగి ఏప్రిల్ నాటి పరిస్థితులు నెలకొనేలా చర్చల ప్రక్రియ పున:ప్రారంభమైంది.

Recommended Video

    India-China Border : త్రివిధ దళాలకు ప్రత్యేక అధికారాలు, రూ. 500 కోట్ల నిధి!!

    మళ్లీ అదే స్థాయిలో..

    మళ్లీ అదే స్థాయిలో..

    భారత సరిహద్దులో తరచూ కయ్యానికి కాలుదువ్వే చైనా.. మే మొదటి వారం నుంచి తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, పాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లో భారీగా సైన్యాలను మోహరించి, మనవాళ్లకు అడ్డు తగులుతూ కవ్వింపులకు పాల్పడుతూ వచ్చింది. ఉద్రిక్తతల నివారణకు మేజర్ జనరల్స్ స్థాయిలో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో జూన్ 6న లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో భేటీ జరిగింది. ఆ చర్చల్లో.. రెండు వైపులా సైనిక బలగాల ఉపసంహరణ(డీఎస్కలేషన్)కు ఒప్పందం కుదిరింది. కానీ గాల్వాన్ లోయ నుంచి వెళ్లినట్టే వెళ్లిన చైనా బలగాలు.. మళ్లీ టెంట్లు వేయడం, వాటిని తొలగించాలన్న భారత బలగాలపై పాశవికంగా దాడి చేయడంతో దశాబ్దాల తర్వాత సరిహద్దులో మరణాలు సంభవించాయి. కాగా, తాజా చర్చలు కూడా కార్ప్స్ కమాండర్లు(లెఫ్టినెంట్ జనరల్స్) స్థాయిలోనే జరగనున్నాయి.

    ఈసారి కూడా చైనా వైపే..

    ఈసారి కూడా చైనా వైపే..

    జూన్ 6 మాదిరిగానే, ఈసారి కూడా ఎల్ఏసీ వద్ద చైనా వైపు భూభాగంలోనే చర్చలు జరగనున్నాయి. అక్కడి మాల్దో పాయింట్ వద్ద ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు వెల్లడైంది. హింసాత్మక ఘటన, గాల్వాన్ లోయపై చైనా సార్వభౌమత్వ ప్రకటన తర్వాత జరుగుతోన్న చర్చలు కావడంతో భారత్ కూడా సరికొత్త స్ట్రాటజీని అనుసరించనున్నట్లు తెలుస్తోంది. గాల్వాన్ ఘటన నేపథ్యంలో సరిహద్దు వెంబడి సైనికులు ఇకపై ఆత్మరక్షణ కోసం ఆయుధాలు వాడొచ్చంటూ కేంద్రం ఆదేశాలిచ్చిన నేపథ్యాన్ని కూడా చర్చల్లో మనవాళ్లు ప్రస్తావించబోతున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.

    రంగంలోకి స్పెషల్ టీమ్స్..

    రంగంలోకి స్పెషల్ టీమ్స్..

    ఇండియాతో స్నేహాన్ని కోరుతున్నామని చైనా విదేశాంగ శాఖ చెడుతుండగా, ఆ దేశ సైన్యం మాత్రం సరిహద్దు నుంచి బలగాలను వెనక్కి తీసుకోకపోవడం డ్రాగన్ ద్వందనీతికి అద్దంపడుతోంది. దీంతో భారత్ కూడా సాధ్యమైనంత మేరలో శాంతికి ప్రయత్నాలు చేస్తూనే ప్రత్యేక బలగాలను సైతం సిద్ధం చేస్తున్నది. పూర్తిగా కొండలతో నిండిన తూర్పు లదాక్ ప్రాంతంలో చైనాను దీటుగా ఎదుర్కొనేలా.. స్పెషల్ మౌంటెయిన్ ఫోర్సెస్(పర్వతాల్లో నేర్పుగా పోరాడగలిగే బలగాలు)ను రంగంలోకి దించింది.

    జిన్‌పింగ్‌పై జనాగ్రహం..

    జిన్‌పింగ్‌పై జనాగ్రహం..

    గాల్వాన్ ఘటనలో భారత సైనికులు చనిపోవడం, వారి పార్థివదేహాలకు వేలమంది నివాళులు అర్పించడాన్ని హైలైట్ చేస్తూ.. అది చైనా విజయంగా జిన్ పిన్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని అక్కడి ప్రజలు తప్పుపట్టారు. గాల్వాన్ ఘర్షణలో చైనా సైనికులు కూడా చనిపోయినప్పటికీ జిన్ పింగ్ సర్కారు ఆ విషయాన్ని దాచి పెడుతోందని.. భారతీయులు మాత్రం గెలుపు-ఓటమితో సంబంధం లేకుండా చనిపోయిన తమ సైనికులను సముచితంగా గౌరవించుకుంటున్నారంటూ చైనా సోషల్ మీడియా వెబోలో వందలాది మంది పోస్టులు పెడుతున్నారు. కనీసం చనిపోయిన తర్వాతైనా సైనికులను గౌరవించకపోవడం దారుణమని చైనా సామాన్య పౌరులు మండిపడుతున్నారు. చనిపోయిన సైనికుడి ఫొటో, అతణ్ని పూడ్చిపెట్టిన ప్రాంతంలోని మట్టిని చేతబట్టుకుని.. మరో సైనికుడు ఎయిర్ పోర్టు నుంచి బయటికి వస్తోన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+