జేఎన్‌యూ ఘటనపై ఎంక్వైరీ, విచారణకు అక్షత్ హాజరుకావాలన్న పోలీసులు, స్టూడెంట్ దూరం..
జేఎన్‌యూలో గత ఆదివారం దాడికి సంబంధించి 'ఇండియా టుడే' చేసిన స్టింగ్ ఆపరేషన్ కలకలం రేపింది. ఏబీవీపీ, వామపక్ష విద్యార్థులకు సంబంధించి ఆడియో టేపులు ఇవ్వాలని ఇండియా టుడేను ఢిల్లీ పోలీసులు అడిగిన సంగతి తెలసిందే. దీనికి సంబంధించి ఏబీవీపీకి చెందిన విద్యార్థి అక్షత్ అవస్తీని విచారణకు హాజరుకావాలని ఢిల్లీ పోలీసులు కోరారు.

ఇన్వెస్టిగేషన్..
కేసు విచారణ కోసం అక్షత్ అవస్తీ సహా రోహిత్ షా కూడా హాజరుకావాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కోరారు. విచారణకు రోహిత్ సహాను కూడా తీసుకురావాలని వారు కోరారు. కానీ పోలీసు విచారణలో భాగస్వామ్యమయ్యేందుకు అక్షత్ సుముఖంగా లేరని తెలుస్తోంది. విచారణకు హాజరుకాబోనని తన సన్నిహితుల వద్ద అక్షత్ తెలిపినట్టు సమాచారం.

ఎవరో తెలియదే..
ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్‌లో అక్షత్ అవస్తీ, రోహిత్ షా పేర్లు బయటకు రాగా.. ఏబీవీపీ వెంటనే స్పందించింది. ఏబీవీపీతో అక్షత్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.

పార్ట్-1
జేఎన్‌యూలో ఆడియో టేపుల పార్ట్-1 వ్యవహారానికి సంబంధించి ఇండియా టు డే స్టింగ్ ఆపరేషన్‌లో ఏబీవీపీకి చెందిన అక్షత్ అవస్తీ, రోహిత్ షా, వామపక్షాలకు చెందిన గీతా సింగ్ పాత్రను రిపోర్టర్ ప్రపంచానికి తెలియజేశారు. అక్షత్ ఫ్రెంచ్ బీఏ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతన్నారు. కర్ర పట్టుకొని, మొహానికి అక్షత్ మాస్క్ వేసుకోగా.. అతనికి రోహిత్ హెల్మెట్ ఇచ్చారు. దీనిని రోహిత్ కూడా అంగీకరించిన సంగతి తెలిసిందే.

గీత పాత్ర
జేఎన్‌యూ విధ్వంసంలో వామపక్ష పాత్రను కూడా ఆడియో టేపులు బహిర్గతం చేశాయి. మూడో విద్యార్థి గీతా కుమారి.. వామపక్ష విద్యార్థి సంఘం ఐసాకు చెందినవారని ఇండియాటుడే రిపోర్టర్ పేర్కొన్నారు. సర్వర్ గదిని మూసివేశామని.. వర్సిటీలో వీసీ తమను ఏమీ చేయనీయరని.. ఆన్‌లైన్‌లో హ్యాపీ న్యూ ఇయర్ పంపిస్తోందని.. కోడ్ భాషలో పేర్కొన్నారు. ఇప్పుడు పరీక్షలు లేవు, డిమాండ్లు నెరవేరే పరిస్థితి లేదు.. అందుకే సర్వర్ గదిని మూసివేయాలని నిర్ణయించుకున్నామని గీతాకుమారి ఆడియో టేపులను కూడా శుక్రవారం ఇండియా టుడే వెల్లడించింది.

పార్ట్-2
పార్ట్-2 అంటూ మరో వీడియోను ‘ఇండియా టుడే' విడుదల చేసింది. ఇందులో ఏబీవీపీకి చెందిన మరో విద్యార్థిని కోమల్ శర్మ ఉన్నారని స్టింగ్ ఆపరేషన్‌లో పేర్కొన్నది. ఆమె జేఎన్‌యూలో చదువుతోన్నారని, ఏబీవీపీ కార్యకర్త అని వివరించింది. వీడియోలో మొహానికి మాస్క్ వేసుకున్న ఫోటోలు, చేతిలో కర్ర పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతోన్నాయి. ఆడియో టేపులు కూడా ట్రోల్ అవడంతో.. కోమల్ శర్మ తన ఉనికిని తెలియజేయొద్దని సీనియర్లను వేడుకుంటున్న ఆడియోలు కూడా బహిర్గతమవుతోన్నాయి. అయితే ఆమె కోమల్ శర్మ అని జేఎన్‌యూలో సీనియర్ విద్యార్థి ఒకరు ‘ఇండియా టుడే' రిపోర్టర్‌కు తెలియజేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications