వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతికించండి: మీ సహాయం ఆ చిన్నారి జీవితాన్ని నిలబెడుతుంది..

దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడన్న ధైర్యంతోనే ఇన్నాళ్లు కుటుంబాన్ని నెట్టుకొస్తూనే.. బిడ్డకు వైద్యం చేయించుకోగలిగాను

|
Google Oneindia TeluguNews

చంటిబిడ్డను ఎత్తుకుని మురిసిపోవాలని భావించిన మాకు.. వరుసగా మూడు సార్లు గర్భస్రావమవడం తీరని విషాదాన్ని మిగిల్చింది. నవంబర్ 8,2016న నా భార్య కవల పిల్లలకు జన్మనివ్వడంతో మా బాధను భగవంతుడు అర్థం చేసుకున్నాడనుకున్నాం.

కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. నెలలు నిండకముందే బిడ్డలను ప్రసవించడంతో శిశువుల ఎదుగుదల్లో లోపాలు బయటపడ్డాయి. ఆ బాధ అలా వెంటాడుతుండగానే కవల పిల్లల్లో ఒక బేబీ మరణించింది. దీంతో మా బాధ రెట్టింపయ్యింది. బిడ్డలు లేని మాకు.. భగవంతుడు ఆ లోటును తీర్చాడనుకునే లోపే మరో విషాదం ఇలా ఎదురైంది.

After Losing One Of Their Twins, They’re Struggling To Save The Other

ఉన్న ఒక్కగానొక్క కొడుకునైనా బతికించుకోవాలన్న ఉద్దేశంతో 'వీర(ఫైటర్)' అని నామకరణం చేశాం. మాకు మిగిలింది ఇక వీర ఒక్కడే అని అపురూపంగా చూసుకుంటూ వస్తున్నాం. ఆ ఆనందం మాటల్లో వ్యక్తీకరించలేనిది. కానీ ఇంతలోనే ఆ ఆనందం కూడా విషాదంగా మారిపోయే దుస్థితి. 'ఇంటెన్సివ్ కేర్ యూనిట్' బయట నిలబడి బిడ్డను గ్లాసులో నుంచి చూడాల్సి రావడం వర్ణించలేని విషాదం.

శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న మా చిన్నారికి వెంటిలేటర్ మీద ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇంటికి తీసుకెళ్లిపోదామంటే.. 24*7ఆక్సిజన్ సిలిండర్ పెట్టాల్సిందేనని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికీ రూ.12లక్షల దాకా ఖర్చు చేశాం. ఇప్పుడా డబ్బును ఆసుపత్రి యాజమాన్యానికి చెల్లిస్తే తప్ప.. మా బిడ్డను మాతో పంపించరు. ఆర్థికంగా చేయూత అందించగలిగే వాళ్లంతా మా పట్ల స్పందిస్తే.. మా బిడ్డను బతికించినవాళ్లవుతారు.

After Losing One Of Their Twins, They’re Struggling To Save The Other

నా పేరు యోగేష్ ఖన్నా. చెన్నైలోని టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లో పనిచేసే నాకు నెలకు రూ.28వేల జీతం. తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత కూడా నాపైనే ఉంది. దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడన్న ధైర్యంతోనే ఇన్నాళ్లు కుటుంబాన్ని నెట్టుకొస్తూనే.. బిడ్డకు వైద్యం చేయించుకోగలిగాను. నా బిడ్డను బతికించుకోవాలన్న మా ఆరాటానికి కొంత ఆర్థిక చేయూత కావాలి.

బిడ్డలను బతికించుకోవడానికి ఎంత ఖర్చు పెట్టానన్నది చెప్పుకోవడం నాకిష్టం లేదు. కానీ నాకు తెలుసు.. ప్రతీ విలువైన బంగారాన్ని, దాచిపెట్టుకున్న డబ్బును అందుకోసం పూర్తిగా వినియోగించాం. దానికి తోడు బ్యాంకు లోన్లు కూడా. ఇప్పుడిక మా వద్ద మిగిలింది ఏమి లేదు. అందుకే నాకు కొంత ఆర్థిక సహాయం కావాలని యాచిస్తున్నా.

After Losing One Of Their Twins, They’re Struggling To Save The Other

చనిపోయిన నా బిడ్డ కోసం రూ.12లక్షలు ఖర్చు చేశాను. కానీ కనీసం నా బిడ్డను తాకే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది. ఇప్పుడు వీరను బతికించుకోవడానికి రూ.53లక్షలు ఖర్చు చేశాను. ఐసీయూలో రోజుకు రూ.15వేల బిల్లు అవుతోంది. నెలలు నిండకుండానే పుట్టడం వల్ల వీర ఊపిరితిత్తులు పూర్తి స్థాయిలో ఎదగలేదు. వీరను ఇంటికి తీసుకెళ్తే.. ఆక్సిజన్ సిలిండర్ కొనాల్సి ఉంటుంది. దానికి రూ.2లక్షల దాకా ఖర్చవుతుంది. అంత డబ్బు పెట్టి దాన్ని కొనలేం కాబట్టి.. రూ.18వేలకు రెంటుకు తీసుకోవాలనుకుంటున్నాం.

ఇతరత్రా వైద్య సేవల నిమిత్తం నెలకు మరో రూ.50వేల వరకు ఖర్చవుతుంది. వీరకు ఎప్పుడెలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందో తెలియదు కాబట్టి.. ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇక్కడ రోజుకు రూ.30వేలు చెల్లించేంత స్తోమత మావద్ద లేదు. పుట్టినప్పుడు 740గ్రాములు మాత్రమే ఉన్న బిడ్డ ఇప్పుడు 5.5కేజీలు ఉన్నాడు. ఖర్చుకు వెనకాడకుండా వాడిని బతికించుకుని వచ్చే పుట్టినరోజును ఘనంగా చేయాలనుకుంటున్నాం. ఈ ఆర్టికల్ మీరింకా చదువుతున్నారంటే.. మీ నుంచి మాకు సహాయం అందుతుందని ఆశిస్తున్నాం. మా బిడ్డను కాపాడుకోవడంలో మీవంతు సహాయం అందిస్తారని ఆశిస్తూ..

English summary
After 3 heartbreaking miscarriages, my wife and I were blessed with twins on November 8, 2016. Our prayers were finally answered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X