పంజాబ్‌లో మరో దారుణం: బస్సులో మహిళ పట్ల ఘోరం, పట్టించుకోలేదు
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని మోగాలో జరిగిన లైంగిక దాడులు మరవకముందే ఆదివారం నాడు మరో సంఘటన వెలుగు చూసింది. మోగా జిల్లాలో రెండు దారుణ సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఓ ఘటనలో బాలికను బస్సులో నుండి తోసివేయడంతో ఆమె మృతి చెందింది కూడా.
తాజాగా, ఖన్నా ప్రాంతంలో ఆదివారం నాడు మహిళను ఓ ప్రయివేటు బస్సులో లైంగికంగా వేధించారు. ఇందుకు సంబంఎధించి పోలీసులు సదరు ప్రయివేటు బస్సు డ్రైవర్, కండక్టర్ పైన కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఓ వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ప్రయివేటు బస్సులో ఆమె వెళ్తుండగా.. పక్కనున్న వ్యక్తి వేధించాడు. డ్రైవర్, కండక్టర్ సహాయాన్ని ఆమె కోరింది. అయితే వారు పట్టించుకోలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను సదరు వ్యక్తి వేధిస్తున్నప్పటికీ బస్సు డ్రైవర్, కండక్టర్ పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.
గత వారం బస్సులో ఓ బాలిక పైన లైంగిక దాడి జరిగింది. అనంతరం ఆ బాలికను బస్సులో నుండి కిందకు తోసేశారు. గాయాలపాలైన ఆ బాలిక మృతి చెందింది. అడ్డుకోబోయిన ఆ బాలిక తల్లిని కూడా బస్సులో నుండి తోసేశారు. ఇది లోకసభలోను ప్రకంపనలు సృష్టించింది. ఈ బస్సు ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబానికి చెందినది. దీంతో, బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి రూ.30 లక్షలు ప్రకటించారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications