ప్రతిపక్షాల భేటీ మూడో వేదిక సిద్ధం
బెంగళూరు: వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ- దీని దూకుడును నిలువరించడానికి యూపీఏ సమాయాత్తమౌతోన్నాయి. ఎన్డీఏను ఉమ్మడిగా ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమౌతోన్నాయి.
ఇదివరకు బిహార్ రాజధాని పాట్నాలో తొలిసారిగా భేటీ అయ్యాయి. దీనికి కొనసాగింపుగా బెంగళూరులో మలి విడత భేటీని నిర్వహించాయి. దేశవ్యాప్తంగా 26 ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇందులో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ సంకీర్ణ కూటమిని ఎదుర్కొనడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తోన్నారు.

ఈ సమావేశం ముగిసిన అనంతరం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర స్థాయిలో తమలో కొందరి మధ్య విభేదాలు ఉన్నాయనే విషయాన్ని అంగీకరించారు. రాష్ట్రస్థాయిలో అధికారంలో ఉండటం, ప్రతిపక్ష పార్టీలతో సైద్ధాంతికపరంగా విభేదించడం వంటి పరిణామాలు నెలకొన్నాయని పేర్కొన్నారు.
ఆయా విభేదాలన్నీ సైద్ధాంతికమైనవి కావని, సమాజ శ్రేయస్సు కోసం రెండు పార్టీల మధ్య ఉండే భావసారూప్యమని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో మాత్రం ఆయా విభేదాలన్నింటినీ పక్కన పెట్టి ఏకం కావాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఎన్డీఏ హయాంలో దేశవ్యాప్తగా పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, మధ్యతరగతి, యువత, పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల హక్కులు తెరవెనుక నిశ్శబ్దంగా అణచివేతకు గురవుతున్నాయని అన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటే రాష్ట్రస్థాయిలో తమ మధ్య ఉన్న ఈ విభేదాలు పెద్దవి కాబోవని ఖర్గే తేల్చి చెప్పారు.
ఇక తమ మూడో విడత సమావేశాన్ని ముంబైలో నిర్వహించబోతోన్నామని ఖర్గే పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా తేదీని తరువాత నిర్ధారిస్తామని చెప్పారు. ఇకపై వరుస భేటీలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. పాట్నా, బెంగళూరుల్లో కంటే ముంబైలో నిర్వహించబోయే సమావేశం నాటికి తమ బలం మరింత పెరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాల సమావేశాలను విజయవంతంగా చేపట్టడానికి ప్రత్యేకంగా ఓ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయబోతోన్నామని ఖర్గే తెలిపారు. ఇందులో 11 మంది సభ్యులు ఉంటారని, వారిని ప్రతిపక్ష పార్టీల నుంచి ఎన్నుకుంటామని చెప్పారు. కోఆర్డినేషన్ కమిటీలో అన్ని ప్రధాన పార్టీలకు ప్రాతినిథ్యం లభిస్తుందని పేర్కొన్నారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications