వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా బోర్డర్‌లో టెన్షన్: ప్రధాని మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ - డిఫెన్స్ రివ్యూపై బ్రీఫింగ్

|
Google Oneindia TeluguNews

వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి(ఎల్ఏసీ) చైనాతో ఉద్రిక్తతల్ని తగ్గించే దిశగా సైనిక, దౌత్య మార్గాల్లో భారత్ చేస్తోన్న ప్రయత్నాలేవీ ఆశించినంతగా ఫలించడంలేదు. పైగా, డ్రాగన్ కవ్వింపులు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అనుసరించాల్సిన తదుపరి వ్యూహాలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను పిలిపించుకుని తూర్పు లదాక్ లో పరిస్థితులపై మోదీ వివరాలు అడిగినట్లు సమాచారం.

చైనాతో టెన్షన్: ఢిల్లీలో హీట్ - త్రివిధ దళాలతో రాజ్‌నాథ్ రివ్యూ - అజిత్ దోవల్ 'స్పెషల్’ ఎంట్రీ చైనాతో టెన్షన్: ఢిల్లీలో హీట్ - త్రివిధ దళాలతో రాజ్‌నాథ్ రివ్యూ - అజిత్ దోవల్ 'స్పెషల్’ ఎంట్రీ

చైనా సరిహద్దులో టెన్షన్ వాతావరణం, ప్రస్తుతం అక్కడ నెలకొన్న వాస్తవ పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం మధ్యాహ్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్ తోపాటు త్రివిధ దళాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చైనాతో దౌత్య పరమైన చర్చల్లో 'స్పెషల్ రిప్రెజెంటేటివ్'గా వ్యవహరించిన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కూడా ఆ భేటీలో పాలుపంచుకున్నారు. సుదీర్ఘంగా సాగిన మీటింగ్ లో సరిహద్దుకు సంబంధించిన కీలక విషయాలను చర్చించారు. భేటీ ముగిసిన వెంటనే ఎన్ఎస్ఏ దోవల్.. ప్రధాని మోదీ వద్దకు పయనమయ్యారు.

 చైనాతో చర్చలు వేస్ట్ - మన జవాన్లకు భోజనంలో తేడాలు - పార్లమెంటరీ కమిటీలో రాహుల్ గాంధీ ఫైర్ చైనాతో చర్చలు వేస్ట్ - మన జవాన్లకు భోజనంలో తేడాలు - పార్లమెంటరీ కమిటీలో రాహుల్ గాంధీ ఫైర్

 after rajnath review, NSA Ajit Doval reportedly meets PM Modi over standoff with China

త్రివిధ దళాలతో రక్షణ మంత్రి జరిపిన రివ్యూ మీటింగ్ సారాంశాన్ని ఎన్ఎస్ఏ అజిత్ దోవల్.. ప్రధాని మోదీకి వివరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఎన్ఎస్ఏతో మీటింగ్ తర్వాత రక్షణ మంత్రి, త్రివిధ దళాల అధిపతితోనూ ప్రధాని మాట్లాడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎల్ఏసీ వెంబడి ఏప్రిల్ నాటి యధాస్థితి(స్టేటస్ కో) ఏర్పడేందుకు భారత్ చేస్తోన్న ప్రయత్నాలకు చైనా అడుగడుగునా అడ్డుపడుతున్నది. మాస్కో వేదికగా గురువారం రాత్రి జరిగిన చర్చల్లో భారత, చైనా విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యీలు 'ఐదు సూత్రాల'కు అంగీకారం కుదుర్చుకున్నా, అవన్నీ పాత ఒప్పందాల కొనసాగింపునకు సంబంధించినవే తప్ప.. ఇప్పటికిప్పుడు బలగాల ఉపసంహరణ(డీఎస్కలేషన్) దిశగా నిర్మాణాత్మక ఫలితమేదీ రాలేదు. ఈ క్రమంలో భారత్ తదుపరి అడుగు ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.

English summary
Defence Minister Rajnath Singh security review meeting, it is heared that National Security Advisor (NSA) Ajit Doval holds a meeting with Prime Minister Narendra Modi to discuss the months-long standoff with China and the situation at the Line of Actual Control (LAC) in eastern Ladakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X