టీవీ సీరియల్ ఆశపెట్టి 15 సార్లు రేప్ చేశాడు
ముంబై: తమ కలలను సాకారం చేసుకోవడానికి చాలా మంది ముంబై వచ్చి బాలీవుడ్‌లో తమ సత్తా చాటుకోవాలని ఆశపడుతుంటారు. నటులుగా, నటీమణులుగా వెలుగొందాలని కోరుకుని ముంబై వస్తుంటారు. అలా ముంబైలో అడుగు పెట్టింది ఓ పాతికేళ్ల యువతి. ఆమెకు వివాహమైంది, ఐదు నెల పాప కూడా ఉంది. ఆమె ఇప్పటికే టీవి కార్యక్రమాల్లో నటిస్తోంది.
ఆమెకు టీవి సీరియల్స్‌లో పెద్ద పాత్ర ఇప్పిస్తానని హామీ ఇచ్చి, ఓ కెమెరామన్ ఆమెపై 15 సార్లు అత్యాచారం చేశాడు. మిడ్‌డే వార్తాకథనం ప్రకారం - రవీంద్రనాథ్ ఘోష్ అనే వ్యక్తి అంధేరీలో ఆమెను మొదటిసి 2011లో కలిశాడు.
గోర్‌గావ్‌కు చెందిన ఘోష్ తనకు చాలా మంది నిర్మాతలు తెలుసునని, తనతో సెక్స్‌కు ఒప్పుకుంటే సాస్ - బహు సీరియల్స్‌లో పెద్ద పాత్ర ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. బాధితురాలితో శారీరకంగా కలిసినట్లు ఘోష్ పోలీసు విచారణలో అంగీకరించాడు.

బాలీవుడ్‌లో అది సాధారణమని, ఒకటి పొందాలంటే మరోటి వదులుకోవాలని, ఇది బాలీవుడ్ స్వభావమని, ఆమెకు తాను హామీ ఇచ్చానని, హోటల్ లాడ్జి బిల్లులు చెల్లించానని, తాను రెండు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశానని ఘోష్ వివరించాడు.
బికినీలు ధరించి, పారదర్శకమై దుస్తుల ధరించి పోజులు ఇవ్వాలని, అందంగా కనిపిస్తే టీవీ సీరియల్స్‌లో అవకాశాలు వస్తాయని ఘోష్ బాధితురాలికి చెప్పాడు. అయితే, బాధితురాలు అతనికి దూరం జరిగింది. దాంతో ఫొటోలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పెడతానని, గుజరాత్‌లో పనిచేస్తున్న భర్తకు వాటిని పంపుతామని అతను ఆమెను బెదిరిస్తూ వచ్చాడు.
ఆమెను అతను 3 లక్షల రూపాయలు డిమాండ్ చేయడమే కాకుండా భర్తకు ఫొటోలు పంపించాడు. తన భర్తకు విషయం చెప్పడంతో తన భర్త తనతో మాట్లాడడం మానేశాడని, తన జీవితం ముగిసిపోయిందని ఆమె వాపోయింది.












Click it and Unblock the Notifications