సాక్షి కంటే ఒకటెక్కువే!: ఐదుగురు పిల్లల్ని కనాలన్న బీజేపీ నేత
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో బీజేపీ నేత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత శ్యామల్ గోస్వామి మాట్లాడుతూ.. హిందూ మహిళ ఐదుగురు పిల్లల్ని కనాలని, తద్వారా మత అభివృద్ధికి తోడ్పడాలన్నారు. శ్యామల్ గోస్వామి బిభుమ్ నేత.
ఇటీవలే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రతి హిందు మహిళ నలుగురు చిన్నారులను కనాలని వ్యాఖ్యానించారు. గత వారం ఆయన మీరట్‌లో ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. నలుగురు భార్యలు, నలభై మంది పిల్లలు అనేది భారత దేశంలో కుదరదని, అయితే, ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలని ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా హిందూ మతాన్ని రక్షించాలన్నారు.

అయితే, ఇలాంటి వ్యాఖ్యల పట్ల భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటోంది. ఆయా నేతలు చెబుతున్న మాటలు వారి వ్యక్తిగతమని చెబుతోంది. అంతేకాదు సాక్షి మహారాజ్‌కు బీజేపీ షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. తాను చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇవ్వాలని సూచించింది.
కాగా, విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) మహిళా నేత అదే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రతి దంపతుల నుంచి తమకు నలుగురేసి పిల్లలు కావాలని ఆమె అన్నారు. విశ్వహిందూ పరిషత్ విరాట్ హిందూ పేర ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు.
ప్రతి హిందూ మహిళ నుంచి నలుగురు పిల్లలు కావాలని ఆమె అన్నారీు. వారిలో ఒకర దేశ సరిహద్దులను కాపాడుతారని, ఒకరిని హిందూ సన్యాసులకు బహుమతిగా ఇవ్వాలని, మూడో సంతానాన్ని విహెచ్‌పి ఇవ్వాలని, తద్వారా సామాజిక సేవ చేయవచ్చునని, నాలుగో సంతానం భారత సంస్కృతిని పరిరక్షించడానికి పనికి వస్తుందని ఆమె వివరించారు.












Click it and Unblock the Notifications