India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి సుప్రీం క్లీన్ చిట్- ఆరోపణలు చేసిన వారంతా జైళ్లకు- 19ఏళ్ల కక్ష తీర్చుకుంటున్నారా ?

|
Google Oneindia TeluguNews

2002లో గుజరాత్ లో చోటు చేసుకున్న మతఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా అల్లర్లను అడ్డుకోవడంలో తీవ్రంగా విఫలమయ్యారు. అయితే ప్రత్యర్ధులు మాత్రం వీరు కావాలనే అల్లర్లకు సహకరించారని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతానికి పోలీసుల్ని వెళ్లనీయకుండా అడ్డుకున్నారంటూ ఏకంగా ఆ రాష్ట్ర డీజీపీ ఆర్బీ శ్రీకుమార్ గతంలో ఆరోపించారు. అల్లర్లలో తన భర్త, కాంగ్రెస్ ఎంపీ ఎహ్ సాన్ జాఫ్రీ సహా పలువురని చంపేశారని, దీని వెనుక భారీ కుట్ర ఉందంటూ ఆయన భార్య జకియా జాఫ్రీ ఆరోపించారు. అయితే సిట్ దీన్ని తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్ధించింది.

మోడీకి సిట్ సుప్రీంకోర్టు క్లీన్ చిట్

మోడీకి సిట్ సుప్రీంకోర్టు క్లీన్ చిట్

2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి గతంలో గుజరాత్ సిట్ ఇచ్చిన క్లిన్ చిట్ ను సుప్రీంకోర్టు తాజాగా సమర్ధించింది. గతంలో సిట్ క్లీన్ చిట్ ను సవాల్ చేస్తూ దివంగత కాంగ్రెస్ ఎంపీ ఎహ్ సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పిటిషనర్ పై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. ఇలాంటి పిటిషన్లతో న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయాలనుకుంటున్నారా అని కూడా ప్రశ్నించింది. సుప్రీంతీర్పుతో ప్రధాని మోడీకి 19 ఏళ్ల తర్వాత ఊరట లభించినట్లయింది. అయితే ఆ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

మోడీ ప్రత్యర్ధుల టార్గెట్

మోడీ ప్రత్యర్ధుల టార్గెట్

2002 నాటికి గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి మోడీ ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగానే హింసాకాండను ప్రేరేపించిందని ఆరోపించిన, ఆధారాలు బయటపెట్టిన, అప్పట్లో ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగని అధికారులు, సామాజిక కార్యకర్తల్ని ఇప్పుడు గుజరాత్ ఏటీఎస్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో గుజరాత్ అల్లర్ల కేసులో మోడీకి ప్రత్యర్ధులుగా మారి కేసులు పెట్టిన, సహకరించకుండా ఎదురుతిరిగిన వారిని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంల టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది.

 తీస్తా సెతల్వాద్, శ్రీకుమార్ అరెస్టులు

తీస్తా సెతల్వాద్, శ్రీకుమార్ అరెస్టులు


గుజరాత్ అల్లర్ల కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ జకియా జాఫ్రీకి న్యాయ సహాయం అందించారు. అలాగే మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్ ఈ అల్లర్లకు సంబంధించిన కీలక వివరాలు బయటపెట్టారు. అలాగే అప్పట్లో మోడీ సర్కార్ ఎన్ని ఒత్తిళ్లు చేసినా లొంగని మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్ ను గుజరాత్ ఏటీఎస్ టార్గెట్ చేసి అరెస్టులు చేస్తోంది.ఇప్పటికే సంజీవ్ భట్ పై పలు కేసులు నమోదు చేసి జైలుకు పంపగా.. తీస్తా సెతల్వాద్, ఆర్బీ శ్రీకుమార్ ను నిన్న వేర్వేరు కేసుల్లో గుజరాత్ ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. తీస్తా సెతల్వాద్ ను ముంబైలో అదుపులోకి తీసుకుని అహ్మదాబాద్ తరలించారు. ఆర్బీ శ్రీకుమార్ ను గుజరాత్ లోనే అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

19 ఏళ్ల కక్ష తీర్చుకుంటున్నారా ?

19 ఏళ్ల కక్ష తీర్చుకుంటున్నారా ?

19 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న గుజరాత్ అల్లర్లలో తనపై పడ్డ మరకతో ప్రధాని మోడీ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారని, 19 ఏళ్లుగా గరళాన్ని లోలోపల మింగుతూ వేదన అనుభవించారని తాజాగా ఆయన కేబినెట్ సహచరుడు అమిత్ షాపేర్కొన్నారు. అయితే అదే సమయంలో తనకు క్లీన్ చిట్ ఇస్తూ అత్యున్నత న్యాయస్ధానం తీర్పు ఇచ్చాక అయినా మోడీలో వేదన తీరలేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన 19 ఏళ్ల వేదనకు కారకులైన వారిని టార్గెట్ చేసి గుజరాత్ ఏటీఎస్ తో అరెస్టులు చేయిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న భయాందోళనలు మోడీ ప్రత్యర్ధుల్లో నెలకొంటున్నాయి.

English summary
after supreme court upholds sit clean chit to pm modi in 2002 gurajat riots case, now ats arrests his opponents teesta setalvad and former dgp rb srikumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X