కొడుకు తేజ్‌పై సెటైర్లు: మోడీపై పడ్డ లాలూ (వీడియో)
పాట్నా: మూడు రోజుల క్రితం బీహార్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తత్తరపాటుకు గురయ్యాడు. దీంతో అతను మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
దీనిపై సామాజిక అనుసంధాన వేదికల్లో వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. దీంతో, లాలూ ప్రసాద్.. ప్రధాని నరేంద్ర మోడీ పైన పడ్డారు.
నెటిజన్లతో పాటు గవర్నర్‌కు కూడా షాకిచ్చేలా లాలూ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. మీరు కూడా మరోమారు ప్రమాణం చేయాల్సిందేనంటూ ప్రధాని మోడీకి ఆయన సూచించారు.

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో గతేడాది మే 26న భారత ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మోడీ ఓ పదాన్ని తప్పుగా పలికారని పేర్కొన్నారు. అక్షుణ్ణ అనే హిందీ పదాన్ని మోడీ.. అక్ష్నగా ఉచ్చరించారని.. ఎత్తిచూపుతూ లాలూ ప్రసాద్ సదరు వీడియోను ప్రధాని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
బీహార్ గవర్నర్ రాంనాథ్ గోవింద్ బీజేపీ నేత అయినందునే తేజ్ ప్రతాప్‌తో ఓ పదాన్ని రెండుస్లారు పలికించారని ఈ సందర్భంగా లాలూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఓ పదాన్ని తప్పుగా పలికిన మోడీ మరోమారు ప్రమాణ స్వీకారం చేయాలని లాలూ డిమాండ్ చేశారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications