ఏపీలో పక్కాగా నిజమైన కేకే సర్వే- హర్యానా ఎన్నికలపై ఏం చెప్పిందో తెలుసా ?

నాలుగు నెలల క్రితం ఏపీ ఎన్నికల ఫలితాన్ని అత్యంత కచ్చితంగా అంచనా వేసిన కేకే సర్వే గుర్తుందిగా.. అప్పట్లో పెను సంచలనం రేపిన ఈ సర్వే ఫలితాల సమయంలో కచ్చితంగా నిజం కావడంతో ఈ సర్వే సంస్థ పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు ఇదే కేకే సర్వే సంస్థ హర్యానా ఎన్నికలపై తమ అంచనాలను వెలువరించింది. ఈ మేరకు హర్యానాలో ఏం జరగబోతోందో కేకే సర్వే చెప్పేసింది. దీంతో ఏపీలో నిజమైన ఈ సంస్థ అంచనాలు హర్యానాలోనూ నిజం అవుతాయా అన్న చర్చ జరుగుతోంది.

హర్యానా ఎన్నికలపై కేకే సర్వే తన ప్రీపోల్ సర్వే అంచనాలను వెలువరించింది. దీని ప్రకారం ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ కచ్చితంగా ఓడిపోతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో బీజేపీ పోటీ చేస్తున్న ప్రతీ మూడు సీట్లలో రెండింటిలో ఓటమి ఖాయమని కేకే సర్వే తేల్చేసింది. ఇంకా చెప్పాలంటే బీజేపీ అక్కడ విపక్ష కాంగ్రెస్ కు ఈసారి గట్టి పోటీ ఇచ్చే పరిస్దితిలో కూడా లేదని తెలిపింది.

after successful ap results kk survey releases opinion on Haryana elections

అలాగే ఈసారి హర్యానా ఎన్నికల ఫలితాలను రైతులు, జాట్ లు ఎక్కువగా ప్రభావితం చేయబోతున్నట్లు కేకే సర్వే తెలిపింది. అయితే బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలువబోతున్నట్లు వెల్లడించింది. బీజేపీ కోర్ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని, అయితే 5 శాతం ఓటు బ్యాంకు తేడాతో ఫలితం పూర్తిగా మారిపోతోందని తెలిపింది. అలాగే ఆప్ అధినేత కేజ్రివాల్ ప్రభావం హర్యానా ఎన్నికలపై ఏమాత్రం లేదని కూడా తేల్చేసింది. అక్కడ బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ కు మాత్రమే ఉందని ఓటర్లు భావిస్తున్నట్లు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+