42 ఏళ్ల పాటు కోమాలోనే: ముంబై నర్సు అరుణ శాన్‌బాగ్ మృతి
ముంబై: 40 సంవత్సరాల పాటు కోమాలో ఉన్న ముంబైకి చెందిన నర్సు అరుణ శాన్‌బాగ్ సోమవారం మృతి చెందారు. 1973లో అత్యాచారానికి గురైన అరుణ శాన్‌బాగ్ 42 ఏళ్లుగా కోమాలోనే ఉన్న విషయం తెలిసిందే.
అరుణ ముంబైలోని కింగ్ ఎడ్ వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసిన సమయంలో క్రూరమైన లైంగిక దాడికి గురయ్యారు. పెనుమోనియా వ్యాధితో బాధపడుతున్న అరుణ శాన్‌బాగ్‌ని గత వారం నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందించారు.

అరుణ శాన్‌బాగ్‌కు మంచిచావుకి అనుమతి ఇవ్వాలంటూ రచయిత్రి, సామాజిక కార్యకర్త పింకీ విరానీ 2011లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె జీవితాన్ని ఏమాత్రం ఆస్వాదించే పరిస్థితిలో లేదని, ఆమె ఉన్న దయనీయ పరిస్థితి కంటే మంచిచావుకి అనుమతించడమే మేలని విరానీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కింగ్ ఎడ్ వర్డ్ మెమోరియల్ ఆసుపత్రి సిబ్బంది సైతం అందుకు అంగీకరించలేదు. నవంబర్ 27, 1973న ఆసుపత్రి వార్డ్ బాయ్ సోహాన్ లాల్ బార్తా వాల్మీకి అత్యంత క్రూరంగా అరుణ శాన్‌బాగ్‌పై లైంగికంగా దాడికి పాల్పడ్డాడు.
ఈ దాడిలో వాల్మీకి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అరుణ శాన్‌బాగ్ ఆసుపత్రి బేస్‌మెంట్‌పై నుంచి కింద పడ్డారు. దీంతో ఆమె మెదడులోని కణాలు పూర్తిగా దెబ్బతిని, విగతజీవిగా మరారు. అప్పటి నుంచి ఆమెను నర్సులే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications