Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !
జైపూర్: ఇంట్లో ఉన్న ముస్లీం మహిళను బయటకు లాగిన కొంతమంది ఆమెను చావబాదేశారు. గ్రామంలోకి అడుగుపెట్టిన కొంతమంది ఇంట్లో పని చేసుకుంటున్న ఆమెను బయటకు పిలిచారు. బయటకు వచ్చిన ముస్లీం మహిళను బూతులు తిట్టి దూషించిన కొంత మంది నువ్వు మంత్రగత్తెవు, నీ కారణంగా మా బిడ్డ చనిపోయాడు అంటూ చేతికి చిక్కిన కర్రలు తీసుకుని ఆమె ప్రాణం పోయాలా చితకబాదడం కలకలం రేపింది. గ్రామస్తులు సైతం ఆ ముస్లీం మహిళను కాపాడటానికి సాహసం చెయ్యలేకపోయారు.

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ?
రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని అనుమానంతో ఆమెను మంత్రగత్తె అని పిలుస్తున్నారు. ఇక్బాన్ ఖాన్ అనే వ్యక్తితో పాటు ఆరు మంది భజన్రి గ్రామంలోకి వెళ్లారు. ఇంట్లో ఆ ముస్లీం మహిళ ఆమెపని ఆమె చేసుకుంటున్నది.

బిడ్డను చంపేసిందని అనుమానం
ఇక్బాల్ అతని అనుచరులు ఇంట్లో ఉన్న ముస్లీం మహిళను బయటకు లాక్కొని వచ్చారు. నువ్వు మంత్రాలు వెయ్యడం వలనే మా బిడ్డ చనిపోయాడని, నీలాంటి మంత్రగత్తె బతికుంటే నా ఇంటి తల్లిదండ్రులు వారి బిడ్డలను పోగొట్టుకుని జీవితాంతం బాదపడాల్సి ఉంటుందని రెచ్చిపోయారు. నీలాంటి మంత్రగత్తెను చంపేయాలి అంటూ ఆ ముస్లీం మహిళను పట్టుకుని చేతికి చిక్కిన కర్రలు తీసుకుని చితకబాదేశారు.

మరోసారి తెలిస్తే నీ ప్రాణాలు తీసేస్తాం
మహిళను కిందపడేసి ఆమెను చావబాదేశారు. ముస్లీం మహిళ చనిపోతుందనే భయంతో గ్రామస్తులు ఇక్బాల్ తో పాటు అతని అనుచరులను అడ్డుకుని వారికి నచ్చచెప్పారు. ఇంకోసారి నువ్వు మంత్రాలు వేశావు అని తెలిస్తే నిన్ను చంపేస్తామని ఇబ్బాల్ ఆ మహిళకు హెచ్చరించి వెళ్లిపోయారు.

జిల్లా ఎస్పీ చెబితే కేసు నమోదు చేసిన పోలీసులు
ముస్లీం మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా మొదట కేసు నమోదు చెయ్యలేదు. బుండి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇక్బాల్ అతని అనుచరుల మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. మంత్రగత్తె అని చితకబాదడంతో ఆ ముస్లీం మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.












Click it and Unblock the Notifications