వాట్సప్ ద్వారా తలాక్ పంపిన భర్త... న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన భార్య
పెళ్లి చేసుకున్న ఆరేళ్ల తరువాత ఓ ముస్లిం మహిళకు ఆమె భర్త వాట్సప్ ద్వారా తలాక్.. తలాక్.. తలాక్ అంటూ విడాకులిచ్చాడు. దీంతో న్యాయం కోసం బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు
న్యూఢిల్లీ: భర్త ఫోన్ నుంచి వచ్చిన వాట్సప్ సందేశాన్ని చూసిన ఆ భార్య హతాశురాలయ్యింది. పెళ్లి చేసుకున్న ఆరేళ్ల తరువాత ఓ ముస్లిం మహిళ(28)కు ఆమె భర్త వాట్సప్ ద్వారా విడాకులిచ్చాడు.
తనకు ఇష్టం లేకపోయినా భర్త వాట్సప్ ద్వారా తలాక్ అనే సందేశాన్ని పంపించడంతో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి ఈ పోరాటంలో ఆమె కుటుంబమైనా ఆమెకు తోడుగా నిలుస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఢిల్లీలో నివాసం ఉండే ఓ ధనిక ముస్లిం కుటుంబానికి చెందిన మహిళకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఆ సందర్భంగా వరుడికి వధువు తల్లదండ్రులు భారీగానే కట్నకానుకలు ముట్టజెప్పారు. వీరికి ఒక పాప కూడా పుట్టింది.

అయితే ఇచ్చిన కట్నం సరిపోలేదంటూ భర్త, అత్తమామలు తరచూ వేధించేవారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కట్నం తెమ్మంటూ తన భర్త తనను మెడపట్టుకుని బయటికి గెంటివేశాడని ఆమె పేర్కొన్నారు.
కొన్ని నెలలుగా తాను పుట్టింటిలోనే ఉంటున్నానని, ఇంతలోనే తన ఫోన్ లోని వాట్సప్ కు తలాక్.. తలాక్.. తలాక్ అంటూ తన భర్త మూడుసార్లు సందేశాన్ని పంపించారని, ఈ సంప్రదాయం వల్ల తన కూతురు తీవ్రంగా నలిగిపోతోందని ఆమె వాపోయారు.
మరోవైపు బహుభార్యత్వంకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పులిమీద పుట్రలా.. ఇలా వాట్సప్ సందేశం పంపి తలాక్ చెప్పిన మగధీరుడిని మరి సుప్రీంకోర్టు ఏ రకంగా విచారిస్తుందో?
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications