వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ.. బెంగుళూరు కీచకపర్వంపై నోరు పారేసుకున్న అబు అజ్మీ

' ఒకసారి నా డబ్బు దొంగతనం జరిగితే.. తిరిగి రెండో సారి మళ్లీ అదే స్థానంలో పెట్టకుండా జాగ్రత్తపడుతాను. అంతేగానీ ఆ బాధ్యతను పోలీసుల మీదకు నెట్టేయను. అలాగే అమ్మాయిలు కూడా ఇతరుల నుంచి వేధింపులకు గురికాకుండ

|
Google Oneindia TeluguNews

ముంబై: కొత్త సంవత్సర వేడుకల సందర్బంగా బెంగుళూరులోని సిలికాన్ వ్యాలీలో జరిగిన కీచకపర్వంపై ఇప్పటికే ఓసారి నోరు పారేసుకున్న సమాజ్ వాదీ పార్టీ నేత అబు అజ్మీ.. మరోసారి తన విమర్శలకు పదునుపెట్టారు. తమను తాము రక్షించుకునే బాధ్యత యువతులే చూసుకోవాలన్నారు. పోలీసులు వచ్చేదాకా వేచిచూసే పరిస్థితి ఉండకూడదన్నారు.

అబు అజ్మీ దీనికి ఓ ఉదాహరణ కూడా చెప్పుకొచ్చారు. . ' ఒకసారి నా డబ్బు దొంగతనం జరిగితే.. తిరిగి రెండో సారి మళ్లీ అదే స్థానంలో పెట్టకుండా జాగ్రత్తపడుతాను. అంతేగానీ ఆ బాధ్యతను పోలీసుల మీదకు నెట్టేయను. అలాగే అమ్మాయిలు కూడా ఇతరుల నుంచి వేధింపులకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి' అంటూ అబు అజ్మీ వ్యాఖ్యానించారు.

Again controversial statements by Abu Azmi on bengaluru molestation

అంతకుముందు 'మహిళలు కురచ దుస్తుల్లో అర్థరాత్రులు రోడ్లపై తిరగాల్సిన అవసరమేంటని?' అబు అజ్మీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. భర్తగాని, తమ్ముడుగాని తోడు లేకుండా మహిళలు నైట్ పార్టీల్లో పాల్గొనడాన్ని అసలు మన హైందవ సంసృతి అంగీకరించదని, ఇదంతా పాశ్చాత్య సంస్కృతి అని అభిప్రాయపడ్డారు.

కాగా, ఆయన వ్యాఖ్యలపై భారీ ఎత్తున విమర్శలు రావడంతో దేశంలోని ప్రతి మహిళను తల్లిగా, కుమార్తెగా భావిస్తానని తెలిపారు.అలాంటప్పుడు వారి గురించి తాను తప్పుగా ఎలా మాట్లాడుతానని మాట మార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి అబు అజ్మీ తన నోటికి పనిచెప్పడంతో.. ఆయన వ్యాఖ్యలపై మరోసారి దుమారం రేపేవిగా మారాయి.

English summary
Samajwadi party MP Abhu Azmi again delivered controversial statements on bengaluru molestation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X