ట్వీస్ట్: హీరో విశాల్ నామినేషన్, 3 గంటలకు డెడ్ లైన్, వాళ్లను పిలపించండి, ఈసీ !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తాననే నమ్మకం తనకు ఉందని హీరో విశాల్ అంటున్నారు. ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చి తాను ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి భారత ఎన్నికల కమిషన్ అవకాశం ఇస్తోందనే నమ్మకం తనకు ఉందని హీరో విశాల్ అంటున్నారు. గురువారం మద్యాహ్నం వాళ్లిద్దరిని హాజరు పరచండి, తరువాత నిర్ణయం తీసుకుంటాం అని ఈసీ విశాల్ కు సూచించింది.

విశాల్ కు మరో మలుపు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యాలని హీరో విశాల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు పలు నాటకీయ పరిణామాల మధ్య తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది.

నామినేషన్ మళ్లీ పరిశీలన !
విశాల్ నామినేషన్‌ను మళ్లీ పరిశీలించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఎన్నికల కమిషన్ ఆయనకు చివరి అవకాశం ఇచ్చింది. తాను సమర్పించిన నామినేషన్ పత్రాలను ఎందుకు తిరస్కరించారు, అసలు ఏం జరిగింది అటూ వివరించాలని హీరో విశాల్ ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారి రాజేశ్ లక్టోనిని కలిసి మనవి చేశారు.

వార్నింగ్ ఇచ్చారు ?
తన నామినేషన్ పత్రాలను తిరస్కరించడం, మళ్లీ ఆమోదించడం, తాను ఇంటికి వెళ్లిన తరువాత మళ్లీ తిరస్కరించడంలో అధికార అన్నాడీఎంకే పార్టీ హస్తం ఉందని విశాల్ ఆరోపించారు. అన్నాడీఎంకే పార్టీ నాయకులు తనకు మద్దతుగా నామినేషన్ పత్రాల్లో సంతకాలు చేసిన వారిని బెదిరించారని విశాల్ ఎన్నికల అధికారి రాజేశ్ లక్టోనికి ఫిర్యాదు చేశారు.

వేలుస్వామి చెప్పలేదు !
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేలుస్వామి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నామినేషన్ పత్రాలను తిరస్కరించారని విశాల్ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యం విజయం సాధిస్తోందని, తాను ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం వస్తోందని విశాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

3 గంటలకు రండి
హీరో విశాల్ కు భారత ఎన్నికల కమిషన్ అధికారులు చివరి అవకాశం ఇచ్చారు. విశాల్ నామినేషన్ పత్రాల్లో ఇద్దరి పేర్లు ఫోర్జరీ చేశారని ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. అయితే గురువారం మద్యాహ్నం 3 గంటలకు ఆ ఇద్దరూ స్వయంగా హాజరై తామే నామినేషన్ పత్రాల్లో సంతకాలు చేశామని ఎన్నికల కమిషన్ రిటర్నింగ్ అధికారి వేలుస్వామి ముందు అంగీకరిస్తే ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం ఇస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications