వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాల్‌చౌక్‌లో నాడు మోడీ సాహసం: ఐదు బాబులు పేలినా.. ఇంచు కూడా కదల్లేదు..!! నేడు అక్కడే..!!

|
Google Oneindia TeluguNews

నాడు క‌రుడు గ‌ట్టిన జాతీయ భావంతో బీజేపీ నేతగా ఉన్న న‌రేంద్ర మోదీ మ‌న‌సులో ఉన్న క‌సి..పట్టుద‌ల‌..ప్ర‌తీకారం వెర‌సి నేడు కాశ్మీర్‌ను పూర్త‌గా భార‌త్‌లో విలీనం చేసే దాకా కొన‌సాగింది. 1992లో కాశ్మీర్‌లో తీవ్ర‌వాదులు ఒక హెచ్చ‌రిక చేసారు. ఎవ‌రైనా శ్రీన‌గ‌ర్‌లోని లాల్‌చౌక్ కి వ‌చ్చి జెండా ఎర‌గ‌వేస్తే వాళ్లు ప్రాణాల‌తో తిరిగి వెళ్ల‌ర‌ని వార్నింగ్ ఇచ్చారు. కానీ, అదే ఏడాది అదే లాల్‌భాగ్‌లో బీజేపీ అగ్ర‌నేత ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషీతో క‌లిసి న‌రేంద్ర మోదీ సైతం లాల్‌చౌక్‌లో కాలు పెట్టారు. స‌గర్వంగా భార‌తీయ జెండా ఎగుర వేసారు. తీవ్ర‌వాదులు హెచ్చ‌రించినట్లుగా బాంబాలు వేసారు. కానీ, మోదీ మాత్రం ఇంచు కూడా క‌ద‌ల్లేదు. జెండా ఆవిష్క‌రించారు. జాతీయ గీతం ఆల‌పించారు. నెమ్మ‌దిగా న‌డుచుకుం టూ వెళ్లి కారు ఎక్కి వెళ్లిపోయారు..అదే మోదీ..నేడు 2019 ఆగ‌స్టులో జ‌రుపుకొనే స్వాతంత్ర దినోత్స‌వ వేడుకుల‌కు ముందే కాశ్మీర్‌ను భార‌త్‌దే అని చాటి చెప్పారు.

బాంబులు పేలినా..జెండా ఆవిష్క‌రించి మ‌రీ..

బాంబులు పేలినా..జెండా ఆవిష్క‌రించి మ‌రీ..

1992. శ్రీన‌గ‌ర్ ప్రాంతం మీద వేర్పాటు వాదులు..ఉగ్ర‌వాదుల ఆధిప‌త్యం. ఏ ఒక్క‌రూ స్వాతంత్ర దినోత్స‌వం నాడు భార‌త జెండాను సైతం ఆవిష్క‌రించలేని ప‌రిస్థితి. ఆ స‌మయంలో 1992 జ‌న‌వ‌రి 26న ఉగ్ర‌వాదులు బీజేపీ నేత‌ల ప్రయ‌త్నాల‌ను దృష్టిలో ఉంచుకొని హెచ్చ‌రిక చేసారు. ఎవ‌రైనా శ్రీన‌గ‌ర్ ప్రాంతంలో భార‌త జెండాను ఆవిష్క‌రిస్తే తిరిగి ప్రాణాల‌తో వెళ్ల‌ర‌ని హెచ్చ‌రించారు. వారికి స్థానికంగా ఉండే వేర్పాటు వాదులు సైతం మ‌ద్ద‌తు ఇచ్చారు. కానీ, ఆ హెచ్చ‌రిక చేసిన స‌రిగ్గా ఆరు నెల‌ల‌కు బీజేపి నుండి ఇద్ద‌రు వ్య‌క్తులు శ్రీన‌గ‌ర్‌లోని లాల్‌చౌక్‌కు 1992, జూన్ 26న చేరు కున్నారు. తీవ్ర‌వాదుల హెచ్చరికను స‌వాల్ గా తీసుకున్న ఆ ఇద్ద‌రు అనుకున్న విధంగానే అక్క‌డ జెండా ఆవిష్క‌రిం చారు. జాతీయ గీతం పాడారు. వారికి స్థానికంగా భార‌తీయులు మ‌ద్ద‌తుగా నిలిచారు. దీనిని స‌హించ‌ని తీవ్ర‌వాదులు వెంట‌నే అయిదు బాంబులు పేల్చారు. కానీ, జాతీయ గీతం పూర్త‌యిన త‌రువాత‌నే వారిద్ద‌రూ అక్క‌డి నుండి క‌దిలారు.
ఇప్పుడు ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌తీ ఒక్క‌రూ గుర్తు చేసుకుంటున్నారు.

ఇంచు కూడా క‌ద‌ల‌కుండా..నింపాదిగా న‌డుచుకుంటూ..

ఇంచు కూడా క‌ద‌ల‌కుండా..నింపాదిగా న‌డుచుకుంటూ..

లాల్‌చౌక్‌కు చేరుకున్న ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల్లో ఒక‌రు ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి కాగా మ‌రొక‌రు నరేంద్ర మోదీ. ఆ రోజు ఉద‌యం క‌న్యాకుమారి నుండి జ‌మ్ముకు చేరుకున్నారు. అక్క‌డి నుండి వాళ్లు హెలికాఫ్ట‌ర్‌లో శ్రీన‌గ‌ర్‌కు చేరుకున్నాక అక్క‌డ ప‌రిస్థితి అర్దం అయింది. లాల్‌చౌక్ ప్రాంతంలో ఎలాగైనా భార‌త జెండా ఆవిష్క‌రించాల‌ని నిర్ణ‌యించారు. అయితే, నిర్ణ‌యించిన స‌మ‌యం కంటే 15 నిమిషాలు ముందుగానే వారు అక్క‌డ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. భార‌త్ మాతా కీ జై అంటూ నినాదాలు చేసారు. ఆ స‌మ‌యంలోనే అక్క‌డ స‌మీపంలో అయిదు బాంబుల‌ను తీవ్ర‌వాదు లు ప్ర‌యోగించారు. కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వారిలో అనేక మంది వెళ్లిపోయారు. కానీ, ఆ జెండా ఎగుర‌వేస్తున్న ఆ వ్య‌క్తి ఒక్క ఇంచు కూడా క‌ద‌ల‌లేదు.ఆయ‌నే న‌రేంద్ర మోదీ. ఆ త‌రువాత కారులో ఎక్కి అక్క‌డి నుండి హెలికాఫ్ట‌ర్ వ‌ద్ద‌కు చేరుకొని తిరిగి వెళ్లిపోయారు. అక్క‌డ జెండా ఎగుర‌వేసి..జాతీయ గీతం ఆల‌పించి..నింపాదిగా వెళ్లిన న‌రేంద్ర మోదీని చూసి అక్క‌డ ఉన్న భార‌తీయులు సైతం అభినందించారు.

ఇప్పుడు అదే ప్రాంతం మొత్తాన్ని త‌మ అధీనంలోకి..

ఇప్పుడు అదే ప్రాంతం మొత్తాన్ని త‌మ అధీనంలోకి..

ఏ ప్రాంతంలో అయిన జాతీయ జెండాను ఆవిష్క‌రించ‌టానికి వీళ్లేద‌నే హెచ్చ‌రిక‌లు వ‌చ్చాయో..ఇప్పుడు అదే ప్రాంతంలో ఈ నెల‌15న స‌గ‌ర్వంగా భార‌తీయ జెండా ఎగ‌ర‌నుంది. ఎక్క‌డైతే తాను జెండా ఆవిష్క‌ర‌ణ‌కు వెళ్ల‌గా బాంబుల‌తో భ‌య పెట్టే ప్ర‌య‌త్నం చేసారో..ఇప్పుడు ప్ర‌ధానిగా అక్క‌డ ఉన్న తీవ్ర‌వాదుల‌కు..వేర్పాటు వాదుల‌కు పార్ల‌మెంట్ సాక్షిగా కోలుకోలేని దెబ్బ తీసారు. కాశ్మీర్ భార‌త్‌లో అంత‌ర్భాగం అని చాటి చెప్పారు. ఒక్క లాల్‌చౌక్ మాత్ర‌మే కాదు..మొత్తంగా జ‌మ్ము కాశ్మీర్ ఆసాంతం ఇప్పుడు కేంద్రం ఆధీనంలోకి వెళ్లిపోయింది. ప‌రోక్షంగా ప్ర‌ధాని చేతుల్లో ఉంది. అయితే, ఇప్పుడే మొద‌లైంది. అస‌లు క‌ధ ఇంకా ముందుంది అని మ‌రింత ధీమాగా బీజేపీ నేత‌లు చెబుతుండ‌టం చూస్తుంటే..ఇక మోదీ త‌రువాతి ల‌క్ష్యం పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ అనే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

English summary
In 1992 Against Terrorists Warnings BJP leaders Murali manohar Joshi and Narednra Modi went to Lal chowk and Hoist National Flag. At that time terrorists attacked with bombs. But, Modi completed their task.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X