వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో ఖాతా తెరిచిన భారత ప్రధాని (ట్వీట్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోషల్ మీడియా వెబ్‌సైట్లలో భారత ప్రధాని నరేంద్రమోడీ హవా అంతకంతకు పెరుగుతోంది. తాజాగా ఆయన చైనా సోషల్ మీడియా వెబ్‌సైట్ 'సినా వైబో'లో ఖాతా తెరిచారు. చైనాలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సోషల్ మీడియా వెబ్‌సైట్‌ను 30 శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగిస్తారు.

 Narendra Modi

ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో చైనాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'హలో చైనా! వైబో ద్వారా చైనా స్నేహితులతో మాట్లాడడానికి ఎదురుచూస్తున్నాను' అని మోడీట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

అదే విధంగా వైబోలో కూడా మోడీ చైనా భాషలో మొదటి పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ వైబోలో చేరిన గంటలోపే నాలుగు వేలకు మందికి పైగా ఆయన పేజీని లైక్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ తన మూడు రోజుల చైనా పర్యటనకు మే 14 నుంచి 16 వరకు వెళ్లనున్నారు.

చైనా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ... చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సొంత గ్రామాన్ని సందర్శించనున్నారు. చైనాలో 500 మిలియన్లకు పైగా వినియోగిస్తోన్న ఈ సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌లో ఖాతా తెరిచిన మొదటి భారతీయ రాజకీయ నేత నరేంద్రమోడీ. బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరూన్‌కి కూడా ఈ వైబోలో అకౌంట్ ఉంది.

English summary
Prime Minister Narendra Modi announced on Twitter on Monday that he has joined Chinese micro blogging website Weibo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X