ప్రతిపక్ష పార్టీ నేతల నివాసాలపై సీబీఐ మెరుపుదాడులు: ముందే ఊహించాం..!!
పాట్నా: మొన్నటికి మొన్న ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల నివాసాలపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ అధికారులు దాడులు కొనసాగించారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై కేసులు నమోదు చేశారు. కొందరు సీనియర్ ఐఎఎస్ అధికారులనూ వదల్లేదు. మద్యం పాలసీ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ సస్పెండ్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో జోక్యం చేసుకుంది.

బిహార్‌పై
ఈ పరిణామాల మధ్య ఇప్పుడు తాజాగా సీబీఐ అధికారులు- బిహార్, జార్ఖండ్‌పై దృష్టి పెట్టారు. రాష్ట్రీయ జనత దళ్ నాయకుల నివాసాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఒకవంక అధికార జనత దళ్ (యునైటెడ్)-ఆర్జేడీ ప్రభుత్వం బల నిరూపణ కోసం సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సీబీఐ అధికారులు దాడులకు పూనుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్జేడీ శాసన మండలి సభ్యులు సునీల్ సింగ్, సుబోధ్ సహాయ నివాసంపై ఈ తెల్లవారు జాము నుంచీ ఈ దాడులు కొనసాగుతున్నాయి.

జార్ఖండ్‌లోనూ..
వారిద్దరితో పాటు ఆర్జేడీ సీనియర్ నాయకులు అష్ఫక్ కరీం, ఫయాజ్ అహ్మద్ నివాసాలపైనా ఈ దాడులు జరిగాయి. భూములకు ప్రతిఫలంగా రైల్వేలో ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్‌లోనూ సీబీఐ అధికారులు దాడులు చేపట్టారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సన్నిహితుడు, జార్ఖండ్ ముక్తి మోర్చా శాసన సభ్యుడు పంకజ్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు.

జేడీయూ-ఆర్జేడీ..
కాగా- ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జనతా దళ్ (యునైటెడ్)తో మొన్నటి వరకు బీజేపీ అధికారంలో కొనసాగిన విషయం తెలిసిందే. భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఈ రెండు పార్టీలు విడిపోయాయి. తేజస్వి యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ సహకారంతో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని నెలకొల్పారు. జేడీయు-ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన అతి కొద్దిరోజుల్లోనే సీబీఐ అధికారులు ఈ దాడులకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ముందే ఊహించాం..
ఈ దాడుల పట్ల ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా స్పందించారు. ఈ దాడులు జరుగుతాయని తాము ముందే ఊహించామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల మీద బీజేపీ ఈడీ, ఐటీ, సీబీఐ అధికారులను ప్రయోగించడం సర్వసాధారణంగా మారిందని అన్నారు. ఇప్పుడు ఈ దాడులను ఎదుర్కొంటోన్న నాయకులు బీజేపీలో చేరిన వెంటనే అవన్నీ మాయమౌతాయని ఎద్దేవా చేశారు. సీబీఐ దాడులను రాజకీయ ప్రలోభాలు, బెదిరింపులకు వాడుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ అరాచకాలు ఎంతోకాలం కొనసాగబోవని అన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications