అసదుద్దీన్ ఓవైసీ 'మహా' టూర్: హద్దు దాటొద్దని శివసేన హెచ్చరిక
ముంబై: మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి శివసేన పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల నాలుగవ తేదీన మహారాష్ట్రలో జరిగే ఓ సమావేశంలో అసద్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయ వేడి రాజుకుంటోంది.
ముస్లీంలకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తు పుణేలో నిర్వహించనున్న ర్యాలీ, సమావేశానికి అసదుద్దీన్ ఓవైసీని నిర్వాహకులు ఆహ్వానించారు. దీని పైన శివసేన ప్రతినిధి బృందం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. ర్యాలీ సందర్భంగా ఓవైసీ హిందూ వ్యతిరక వ్యాఖ్యలు చేసే అవకాశముందని పేర్కొంది.
ఏవైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే శివసేన, పార్టీ ర్యాలీని అడ్డుకుంటుందని హెచ్చరించింది. అనంతరం పరిణామాలకు నిర్వాహకులు, వక్తలే బాధ్యత వహించాలని చెప్పింది. దీనిపై స్పందించిన నిర్వాహకులు.. ఇది రాజకీయేతర సమావేశమ అని, మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశ్యం లేదన్నారు.

సిక్కు వ్యతిరేక అల్లర్లపై సిట్!
సిక్కు వ్యతిరేక అల్లర్ల కాష్ఠం మళ్లీ రాజుకోనుంది. ఘర్షణల్లో వేలాది మంది మరణించి 30 ఏళ్లయినా దర్యాప్తులో ఎవరికీ శిక్షలు పడకపోయినా ఈ అంశం కాంగ్రెస్‌ను వదలడం లేదు. ఈసారి ఢిల్లీ ఎన్నికల సమయంలో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. 1984నాటి ఘర్షణ లపై మళ్లీ దర్యాప్తు చేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ జీపీ మాథుర్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (ఎస్‌ఐటీ) నియమించాలనీ సూచించింది.
డిసెంబర్ 23న కేంద్రం ఈ కమిటీని నియమించగా పోయిన వారం నివేదిక వచ్చింది అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో, 7న పోలింగ్ ముగిశాక సిట్‌ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తరుణంలో ఇలా లీకులివ్వడం సరికాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు.












Click it and Unblock the Notifications