వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 13వేల కోట్ల 'ఆటో డ్రైవర్' దొరికాడు

ఆటో డ్రైవర్‌గా కనిపిస్తూ తన వద్ద 13 కోట్ల రూపాయల నల్ల ధనం ఉందని ప్రకటించిన అహ్మదాబాద్ వ్యాపారి కనిపించకుండా పోయాడు. అతని కోసం ఆదాయం పన్ను శాఖ అధికారులు గాలిస్తున్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్ : తన వద్ద 13 వేల కోట్ల రూపాయల నల్లధనం ఉందని ప్రకటించిన అహ్మదాబాద్ వ్యాపారి కనిపించకుండా పోయాడు. మహేష్ షా అనే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి. ముంబై, ఇతర నగరాల్లో అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారాలు కూడా చేస్తూ వచ్చాడు.

అయితే, ఓ పాత బంగ్లాలో నివసిస్తున్న అతను అందరికీ ఆటో డ్రైవర్‌గానే తెలుసు. కానీ అకస్మాత్తుగా తన వద్ద 13 వేల కోట్ల రూపాయల నల్లధనం ఉందని అక్టోబర్ నెలలో ప్రకటించాడు. తనకు మనశ్శాంతి కావాలని కోరుకున్నానని, అందుకే నల్లధనం వివరాలు వెల్లడిస్తున్నానని చెప్పి అసలు విషయం చెప్పాడు.

ఆటో డ్రైవర్‌గా పరిచితుడైన అతను ఇరుగుపొరుగున పలువురి వద్ద అప్పులు కూడా చేశాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో తన వద్ద రూ. 13,680 కోట్ల ఆస్తి ఉన్నట్లు అధికారులకు వెల్లడించాడు. ఐడీఎస్ పథకం మరో ఐదు నిమిషాల్లో ముగిసిపోతుందనగా సెప్టెంబర్ 30వ తేదీన రాత్రి 11.55 గంటలకు ఆయన ఆస్తులు ప్రకటించాడు.

 Ahmedabad Man, Who Declared Over 13,000 Crores In Black Money, Goes Missing

ఐడీఎస్ కింద దేశవ్యాప్తంగా వసూలైన రూ. 65 వేల కోట్లలో షా వాటానే 20 శాతం ఉండడం విశేషం. తనకు మనశ్శాంతి కావాలని, అందుకే తాను మొత్తం ఆస్తి వివరాలు చెప్తున్నారని ఆయన సీఏ షెత్నా చెప్పారు. అయితే, ఆదాయపు పన్ను అధికారులకు వెల్లడించిన మొత్తం కూడా నగదు రూపంలోనే ఉండడం వల్ల, అది చాలా పెద్దమొత్తం కావడం వల్ల అధికారులు ఆ మొత్తాన్ని ఆయన ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్లేందుకు కూడా అంగీకరించారు.

పథకం నిబంధనల ప్రకారం నవంబర్ 30 నాటికి తొలి వాయిదాలో రూ. 1560 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, ఆయన ఆ మొత్తం కట్టలేకపోయారు. నవంబర్ 29 నుంచే షా కనిపించకుండా పోయారు. దీంతో ఆయన సీఏ షెత్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరోజు రాత్రి 7 గంటల వరకు తనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారని, తర్వాత మాత్రం ఆయన ఫోన్ స్విచాఫ్ అయిపోయిందని షెత్నా చెప్పారు.

దీంతో పోలీసులు, ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలన్నింటిలో సోదాలు చేశారు. ఆయన కోసం ఎన్నిచోట్ల గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, అతను పారిపోలేదని, గత 15 రోజులుగా కాంటాక్టులో లేడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకం ద్వారా 13 వేల కోట్ల రూపాయల నల్లధనం వెల్లడించిన గుజరాత్ వ్యాపారి మహేశ్ షా‌‌ను ఇన్‌కం టాక్స్ అధికారులు పట్టుకున్నారు. అహ్మదాబాద్‌లో ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. 13 వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఎగుమతి, దిగుమతులు చేస్తారని చెప్పుకున్నా వాస్తవానికి షా దగ్గర ఉన్న నల్లధనమంతా రాజకీయ నేతలదేనని అనుమానిస్తున్నారు.

English summary
An Ahmedabad-based businessman, who had declared black money worth over 13,000-crore in October, has gone missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X