చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిష్టి బొమ్మ కాల్చబోయి: పంచెకు నిప్పు(వీడియో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎండీకే వ్యవస్థాపకుడు, ప్రతిపక్ష నేత విజయ్‌కాంత్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు సీఎం జయలలిత, జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయ్‌కాంత్ తీరును నిరసిస్తూ, అధికార అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు చేపట్టిన దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది.

బుధవారం విల్లుపురంలో విజయ్ కాంత్ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా, ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అన్నా డీఎంకే పార్టీ కార్యకర్తలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్యకర్తల పంచెలకు నిప్పు అంటుకుంది. వెంటనే పక్కనే ఉన్న కార్యకర్తలు ఆ మంటలను ఆర్పివేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. కాగా, విజయ్ కాంత్ వైఖరిని జర్నలిస్టు సంఘాలు ఖండించగా, అన్నాడీఎంకే కార్యకర్తలు నిరసన ప్రదర్శించారు. విజయ్ కాంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన పోస్టర్లను కాల్చారు.

English summary
AIADMK Cadre Try To Burn Vijayakanth’s Effigy, 2 Men’s Dhotis Catch Fire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X