మేమే నీకు అండ: శశికళ ఎందుకు దండగ, దీపా పార్టీ డ్రస్ కోడ్ అదుర్స్
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు రాజకీయ రంగప్రవేశం ఆలస్యం అయినా పర్వాలేదని, మంచి నిర్ణయం తీసుకుంటే అంతే పదివేలు అంటున్నారు అన్నాడీఎంకే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు. మేము ఎట్టిపరిస్థితుల్లో శశికళ నాయకత్వాన్ని అంగీకరించమని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు తేల్చి చెప్పారు.
కార్యకర్తలను నిర్లక్షం చేసిన ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు చరిత్రలోనే లేదని చెబుతున్నారు. జయలలితకు ఇష్టం అయిన ఆకుపచ్చ రంగు చీరలు కట్టుకున్న అన్నాడీఎంకే మహిళా కార్యకర్తలు దీపా పేరవై ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు.
దీపాకు ఇలా మద్దతు, శశికళకు షాక్ (ఫోటో గ్యాలరీ)
మంగళవారం ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్బంగా వేలాది మంది కార్యకర్తలు చెన్నైలోని టీ.నగర్ లో ఉన్న దీపా జయకుమార్ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. మహిళలు ఆకుపచ్చ రంగు, ఎరుపు, తెలుపు, నలుపు రంగు బార్డర్ ఉన్న చీరలు కట్టుకుని దర్శనం ఇచ్చారు.

జయలలిత, దీపా ఫోటోలతో ముద్రించిన సభ్యత్వం పుస్తకాలను తీసుకుని దీపాకు మద్దతు తెలిపారు. మెరీనా బీచ్ లోని ఎంజీఆర్ సమాధి దగ్గరకు దీపా వెళ్లిన సమయంలో వేలాది మంది జయలలిత అభిమానులు ఆమెకు మద్దతుగా వెంట వెళ్లారు.
దీపా జయకుమార్ ఇంటి దగ్గర వేలాది మంది గుమికూడటంతో ఆ ప్రాంతంలో ఇసుక వస్తే కింద పడటం కష్టం అయ్యింది. తన మీద చూపిస్తున్న అభిమానానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని, త్వరలో మనకు మంచి రోజులు వస్తాయని దీపా తనను కలిసిన దీపా పేరవై నాయకులు, కార్యకర్తలతో అన్నారు.












Click it and Unblock the Notifications