అన్నాడీఎంకే తీవ్రనిర్ణయం: కలలపై మాట్లాడనని పన్నీరు, బీజేపీని లాగిన దినకరన్
చెన్నై: అన్నాడీఎంకే మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇటీవల గెలిచిన టీటీవీ దినకరన్, చిన్నమ్మ శశికళ వర్గానికి చెందిన వారిపై వేటు వేస్తోంది. తాజాగా మరో 130 మందిపై చర్యలు తీసుకుంది.
పార్టీలోనే తమకు రెబెల్‌గా తయారైన టీటీవీ దినకరన్ కేడర్‌ను తొలగించేందుకు అన్నాడీఎంకే చర్యలను వేగవంతం చేసింది. దాదాపు 130 మందిని దినకరన్ మద్దతుదారులుగా గుర్తించి శుక్రవారం వేటు వేసింది. పార్టీ నుంచి వారిని బహిష్కరించింది.

అన్నాడీఎంకే తీవ్ర నిర్ణయం
పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల నుంచి వీరిని తొలగిస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రకటన చేసింది. పార్టీ సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, సహ సమన్వయకర్త, ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ మేరకు ప్రకటన చేశారు. తిర్పూరు, పుదుకొట్టాయ్, ధర్మపురి ప్రాంతాల్లో పార్టీలో ఉన్న దినకరన్ వర్గీయులను తొలగించినట్లు ప్రకటన చేశారు. వీరిలో 65 మంది ఒక్క తిర్పూర్ నుంచే ఉన్నారు.

దినకరన్ హెచ్చరిక
కాగా, అన్నాడీఎంకేలో ఓ ఐదారుగురు తమ సొంత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని, వారు తమ పద్ధతిని మార్చుకోవాలని ఆర్కే నగర్ నుంచి గెలిచిన దినకరన్ అన్నారు. లేకపోతే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో ప్రభుత్వానికి అదే జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం త్వరలో పడిపోతుందని పరోక్షంగా అన్నారు. ఈ ప్రభుత్వం కేవలం రెండు మూడు నెలలే ఉంటుందని చెప్పారు.

బీజేపీపై దినకరన్ విమర్శలు
ఇదే సమయంలో దినకరన్... పన్నీరు, పళనిలతో పాటు బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఉత్తరాది మద్దతుతో నష్టం చేస్తున్నారన్నారు. ఉత్తరాది అని ఆయన బీజేపీని ఉద్దేశించి అన్నారు. బీజేపీ మీకు గుర్తును, పార్టీ పేరును ఇచ్చేలా చేయగలదేమో కానీ ప్రజల ఓట్లను మాత్రం ఇవ్వలేదన్నారు.

దినకరన్ కలలపై నేను మాట్లాడను
దినకరన్ వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం స్పందించారు. ప్రభుత్వం పడిపోతుందన్న వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. అది అంతా దినకరన్ కల మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఆయన కలలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా దినకరన్ పరప్పన అగ్రహార జైలులో శశికళను కలిసిన విషయం తెలిసిందే. అరగంట పాటు భేటీ అయ్యారు. అయితే ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. అందుకు ఆమె మౌనవ్రతం చేస్తుండటమే కారణమని చెప్పారు. చూపులతో పలకరించి, నవ్వేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications