టీడీపీ-వైసీపీ అవిశ్వాసం ఎఫెక్ట్: అన్నాడీఎంకే నుంచి కీలక నేత బహిష్కరణ
చెన్నై: నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని అన్నాడీఎంకే నేత ఒకరు చెప్పారు. దీంతో ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంది.
అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధిగా కేసీ పలనిస్వామి ఉన్నారు. కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతివ్వాలని ఆయన పార్టీకి డిమాండ్ చేశారు.
దీంతో పన్నీరుసెల్వం-పళనిస్వామిల నేతృత్వంలోని పార్టీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. తన వివరణ కోరకుండానే పార్టీ నుంచి తొలగించారని ఆయన మండిపడ్డారు.

బీజేపీకి 110 సీట్లు తగ్గుతాయని శివసేన
రానున్న లోకసభ ఎన్నికల్లో బీజేపీ 100 నుంచి 110 స్థానాలను కోల్పోతుందని శివసేన జోస్యం చెప్పింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తూ శివసేన పత్రిక సామ్నా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పలు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవ్వడమే దీనికి సంకేతమని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications