చెప్పింది చెయ్యండి, చరిత్ర అడగద్దు: శశికళ వార్నింగ్ !
అన్నాడీఎంకే చీఫ్ గా మీరు బాధ్యతలు స్వీకరించిన తరువాత కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారని కొందరు నేతలు శశికళ దృష్టికి తీసుకు వెళ్లారని తెలిసింది. అయితే ఆ సమయంలో శశికళ అసహనానికి గురై మీరు చెప్పింద
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తనకంటు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి శశికళ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం చెన్నైలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో శశికళ పలు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కీలకనేతలు హాజరైనారు. వారితో శశికళ విడివిడిగా చర్చించారు. మీ జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ? కింద స్థాయి కార్యకర్తలు ఏమనుకుంటున్నారు ? అని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అని శశికళ వారిని అడిగి తెలుసుకున్నారని సమచారం. అదే సమయంలో కొందరు ప్రజా ప్రతినిధులు, కీలక నేతలు వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నించారని సమాచారం.
అన్నాడీఎంకే చీఫ్ గా మీరు బాధ్యతలు స్వీకరించిన తరువాత కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారని కొందరు నేతలు శశికళ దృష్టికి తీసుకు వెళ్లారని తెలిసింది. అయితే ఆ సమయంలో శశికళ అసహనానికి గురై మీరు చెప్పింది చాలు, ఇక ముందు మేము చెప్పంది చెయ్యండి చరిత్ర అడగద్దు అంటు మండిపడ్డారని తెలిసింది.
అన్నాడీఎంకే నాయకులు అందరూ ఇక ముందు తాను చెప్పినట్లు నడుచుకోవాలని, లేదంటే మీ పదవులకు ఎసరు వస్తుందని శశికళ పరోక్షంగా హెచ్చరించారని సమాచారం. అయితే బయటకు వచ్చిన అనేక మంది నాయకులు అక్కడి నుంచి మౌనంగా తిరిగి వెళ్లిపోయారని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు అంటున్నారు.












Click it and Unblock the Notifications