శశికళ: ఆయా నుండి సీఎం స్థాయికి, కుటుంబసభ్యులకు దూరమై, కేసులు తట్టుకొంటూ..

ఆయా నుండి ముఖ్యమంత్రి స్థాయికి శశికళ ఎదిగారు. జయలలిత మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టి, చివరకు ముఖ్యమంత్రి పగ్గాలను చేపట్టేవరకు ఆమె వ్యూహత్మకంగానే అడుగులు వేశారు.

చెన్నై:ఆయా నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు శశికళ. జయ మరణం తర్వాత అన్నాడిఎంకె పార్టీపై పట్టుపెంచుకొన్న శశికళ చివరికు ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు.ఈ మేరకు పార్టీ శాసనసభపక్ష నాయకురాలిగా ఎన్నిక కావడంతో ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం లాంఛనమే. పార్టీ కోసం పన్నీర్ సెల్వం మరోసారి తన ముఖ్యమంత్రి పదవిని ఫణంగా పెట్టాడు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకుగాను అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ వ్యూహత్మకంగా పావులు కదిపారు. చివరకు పై చేయిని సాధించారు.

తొలుత పార్టీపై ఆమె పట్టును సాధించారు. చివరకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కు చెక్ పెట్టారు. పన్నీర్ సెల్వమే శాసనసభపక్ష నాయకురాలిగా శశికళ పేరును ప్రతిపాదించేలా ఎత్తు వేసి విజయం సాధించారామె.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ బాద్యతలు స్వీకరించిన రోజు నుండే ఆమెను ముఖ్యమంత్రి బాద్యతలు చేపట్టాలని పార్టీ నాయకులు కోరుతున్నారు.అయితే సమయం చూసి ఆమె ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించేందుకు ముహుర్తాన్ని ఎంచుకొన్నారు.

ఆయా నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన శశికళ

ఆయా నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన శశికళ

శశికళ శశికళకు పిల్లలు లేరు.అయితే పెద్ద వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలనే ఆసక్తి శశికళ కు ఉండేది.అయితే ఈ ఆసక్తి, ఉత్సాహామే శశికళను జయలలితకు దగ్గరగా చూసింది. శశికళ భర్త నటరాజన్ కలెక్టర్ చంద్రలేఖ వద్ద పార్ట్ టైమ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పనిచేసేవారు. ఆ సమయంలో శశికళ కేసెట్ లెండింగ్ లైబ్రరీ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, వీడియో కవరేజీ షాపు ఏర్పాటు చేయాలని కలెక్టర్ నటరాజన్ కు సలహా ఇచ్చారు. అయితే ఈ సలహాతో శశికళతో వీడియో కవరేజీ షాపు ఏర్పాటు చేయించాడు నటరాజన్..అప్పుడే చంద్రలేఖకు బిడ్డ పుట్టింది. అయితే చంద్రకళ బిడ్డ ఆలనాపాలనా చూసేందుకు ఆమె ఆయాగా వెళ్ళారు. శశికళకు పిల్లలు కూడ లేరు.ఇది కూడ చంద్రకళ వద్ద ఆయాగా పనిచేసేందుకు కారణమైందనే అభిప్రాయం ఉంది.

జయతో పరిచయం మార్పుకు కారణం

జయతో పరిచయం మార్పుకు కారణం

ఎంజిఆర్ బతికున్న సమయంలో జయలలిత అన్నాడిఎంకె ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటించేవారు. తన ప్రసంగాలను రికార్డు చేసి ఇచ్చేందుకు ఓ వ్యక్తి కావాలని జయకు అవసరమైంది. చంద్రకళ ద్వారా జయలలితకు శశికళ పరిచయమైంది. ఈ సందర్భ:గా వీరిద్దరికీ పరిచయం పెరిగింది. ఎంజిఆర్ బతికున్న కాలంలోనే జయను పార్టీనుండి బయటకు పంపేందుకు చేసే కుట్రలపై శశికళ ఓదార్చేదని చెబుతుంటారు.దీంతో శశికళతో ఆమెకు సంబంధం మరింతగా పెరిగిపోయింది.

 జయ తర్వాత శశికళ

జయ తర్వాత శశికళ

అన్నాడిఎంకెలో ఎంజిఆర్ మరణంతో పార్టీని జయ తన గుప్పిట్లోకి తీసుకొన్నారు. ఎంజిఆర్ మరణం తర్వాత కొంత కాలం పాటు ఆయన సతీమణి జానకీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా కూడ కొనసాగారు. జయ, జానకీ రామచంద్రన్ నేతృత్వంలో పార్టీ రెండు గ్రూపులుగా ఉండేది. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం జానకీ రామచంద్రన్ ప్రభుత్వాన్ని రద్దుచేసింది. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు గ్రూపులు వేర్వేరుగా పోటీచేశాయి.అయితే జానకీ రామచంద్రన్ రాజకీయాలకు దూరమయ్యారు.ఆమె నాయకత్వంలో పనిచేసినవారు కూడ జయ వద్దకు చేరారు. జయ నేతృత్వంలోనే పనిచేశారు.ఎంజిఆర్ తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చేలా ఆమె కృషి చేశారు. జయ మరణం తర్వాత పార్టీని తన గుప్పిట్లోకి తీసుకొన్నారు శశికళ. అమ్మ తర్వాత చిన్నమ్మే పార్టీని నడింపిచేలా చక్రం తిప్పారు.

వ్యూహత్మక అడుగులుతో చక్రం తిప్పిన శశికళ

వ్యూహత్మక అడుగులుతో చక్రం తిప్పిన శశికళ

జయ మరణం తర్వాత శశికళ వ్యూహత్మకంగా అడుగులు వేశారు. ఆమె వేసిన వ్యూహత్మక అడుగులు ఆమెకు పార్టీపై తిరుగులేని ఆధిపత్యం చలాయించేలా చేశాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతేకాదు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం స్థానంలో ఆమె బాద్యతలను స్వీకరించనున్నారు. పార్టీ పగ్టాలతో పాటు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే సమయంలో పన్నీర్ సెల్వం స్వయంగా ఆమె పేరును ప్రతిపాదించడం విశేషం .అయితే తనకు తానుగా ఆమె తన పేరును ప్రతిపాదించకుండా తన పోటీదారులనుండే ఆమె తన పేరును ప్రతిపాదించేలా చక్రం తిప్పారు. చివరకు సక్సెస్ అయ్యారు.

 కుటుంబసభ్యులకు దూరమై, కేసుల ఎదుర్కొంది

కుటుంబసభ్యులకు దూరమై, కేసుల ఎదుర్కొంది


కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ , జయలలిత కేసులు ఎదుర్కొన్న సమయంలో ఆమెతో పాటుగా శశికళ కేసులను ఎదుర్కొన్నారు. భర్తకు దూరంగా ఉన్నారు. కుటుంబసభ్యులకు కూడ ఆమె దూరంగానే ఉన్నారు. అయినా ఆమె చలించలేదు. జయ వెన్నంటి ఉన్నారు. ఒకానొక దశలో శశికళను జయ దూరంగా పెట్టారు.ఆమెను తన ఇంటి నుండి పంపేశారు. చివరకు జయ వద్దకు ఆమె వచ్చారు. ఎన్ని ఘటనలు చోటుచేసుకొన్నా ఆమె మాత్రం తొణకలేదు. బెణకలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+