నో డౌట్; నేను ఉన్నంతవరకు అది జరగదు: శశికళ
చెన్నై: అన్నాడీఎంకే అనే అతి పెద్ద వ్యవస్థను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని, అందుకు అవకాశం ఇవ్వమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నెచ్చెలి శశికళ నటరాజన్ ఉద్ఘాటించారు. అలాంటి శక్తులను పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారని, తరిమితరిమి కొట్టే రోజు త్వరలోనే వస్తుందని శశికళ అన్నారు.
చెన్నై నగరంలోని రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో కన్యాకుమారి, తుత్తుకుడి, శివారు, తిరునెల్వేలి జిల్లాల నిర్వహకులతో శశికళ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆ జిల్లాల నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి శశికళ మాట్లాడారు.
ఎంజీఆర్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని నాయకులకు సూచించారు. అమ్మ (జయలలిత)కు ప్రతిష్ట చేకూర్చేలా నెలకొకసారి ప్రచారాల్లో పాల్గొనాలని కార్యకర్తలకు చెప్పారు. పార్టీలో విశ్వాసంగా ఉన్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.

అమ్మ నడిపించిన విధంగానే తాను పార్టీని నడిపిస్తానని తెలిపారు. అన్నాడీఎంకే పార్టీని విచ్ఛిన్నం చెయ్యడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారని, ఆపని ఎవ్వరూ చెయ్యలేరని శశికళ అన్నారు.
అన్నాడీఎంకే పార్టీ మీద జరుగుతున్న విష ప్రచారాన్ని ఎవ్వరూ లక్షపెట్టవద్దని పేర్కొన్నారు. క్రియాశీలక పనులు కొనసాగించాలని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు.
పార్టీ నాయకులతో మాట్లాడిన తరువాత శశికళ నటరాజన్ అన్నాడీఎంకే కార్యకర్తకు ఇటీవల జన్మనించిన పాపకు జయలలిత అని నామకరణం చేశారు. అచ్చం జయలలిత లాగానే ఆ పాపను చిన్నమ్మ ముద్దాడి దగ్గరకు తీసుకున్నారని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.












Click it and Unblock the Notifications