జయలలిత కోసం ఆత్మహత్యలు: వారి కుటుంబాలకు రూ. 7కోట్ల పరిహారం
చెన్నై: గత సంవత్సరం కిందిస్థాయి కోర్టు ఏఐఏడిఎంకె అధ్యక్షురాలు జయలలితను దోషిగా తేల్చిన అనంతరం ఆమె జైలుపాలయ్యారు. తమ నేత జైలుపాలు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పలువురు ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
అయితే మే 11న కర్ణాటక హైకోర్టు జయలలితను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్ధోషిగా తేల్చింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో తన కోసం ఆత్మహత్యలు చేసుకున్న 244 మందికి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని ఏఐఏడిఎంకె నిర్ణయించింది. దీంతో వారి కుటుంబాలకు రూ. 7 కోట్లు పరిహారం ఇవ్వనున్నట్లు ఏఐఏడిఎంకె శనివారం ప్రకటించింది.

‘రూ. 7.32 కోట్ల మొత్తాన్ని చనిపోయిన వారి పరిహారంగా ఇవ్వనున్నాం. ఆత్మహత్యకు ప్రయత్నించి తీవ్ర గాయాలపాలైన నలుగురి చికిత్స కోసం రూ. 2లక్షలు ఇవ్వనున్నాం' అని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
మొత్తం రూ. 7.34 కోట్లను పరిహారంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కాగా, ఏఐఏడిఎంకె పార్టీ అధినేత్రి జయలలిత.. చనిపోయినవారి ప్రతీ కుటుంబానికి రూ. 3లక్షల పరిహారం ప్రకటించారు.












Click it and Unblock the Notifications