జయ ఫ్రెండ్ శశికళ ఓకే సరే: షీలా బాలక్రిష్ణన్ పరిస్థితి ఏంటీ ?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తరువాత ఆమె సన్నిహితురాలు, నమ్మినబంటుకు కీలకమైన పదవులు దక్కాయి. జయలలితకు నమ్మకస్తుడు, తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి పన్నీర్ సెల్వంను తమిళనాడు సీఎం పదవి వరించింది.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తరువాత ఆమె సన్నిహితురాలు, నమ్మినబంటుకు కీలకమైన పదవులు దక్కాయి. జయలలితకు నమ్మకస్తుడు, తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి పన్నీర్ సెల్వంను తమిళనాడు సీఎం పదవి వరించింది.

అదే విధంగా జయలలిత ప్రాణ స్నేహితురాలు నెచ్చళి శశికళ నటరాజన్ కు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. గతంలో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత పని చేశారు. జయలలిత స్థానంలోనే ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళను ఆపదవిలో నియమించారు.

jayalalithaa

అయితే జయలలిత సీఎంగా పని చేసిన సమయంలో ఆమెకు సలహాదారుగా పని చేసిన షీలా బాలక్రిష్ణన్ కు ఇప్పుడు పార్టీలో ఎలాంటి కీలకపదవి వరిస్తుంది అనే విషయం ఇప్పటి వరకు స్పష్టంగా తెలియడం లేదు. షీలా బాలక్రిష్ణన్ కు పార్టీలో మంచి పదవి వరిస్తుందని ఇంత కాలం ఆమె అనుచరులు భావించారు.

అయితే జయలలిత మరణించిన తరువాత కేవలం అమ్మ ప్రాణ స్నహితురాలు శశికళకు మాత్రమే కీలక పదవి ఇచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు షీలా బాలక్రిష్ణన్ జయలలితకు సలహాదారుగా ఉన్నట్లే ఇప్పుడు సీఎం పన్నీర్ సెల్వంకు సలహాదారుగా ఉంటారని తెలిసింది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+