సీన్ రిపీట్: శశికళకు జైలులో నేతల పాదాభివందనం
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను మాజీ మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతిలు కలిశారు.
చెన్నై: అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను మాజీ మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతిలు కలిశారు.
ఈ సందర్భంగా ఆమెకు వీరు పాదాభివందనం చేసి, తమ విధేయతను చాటుకున్నారని అంటున్నారు. అనంతరం, వీరంతా దాదాపు గంట సేపు మాట్లాడుకున్నారు. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించారు.

గతంలో పార్టీ శ్రేణులంతా జయలలితకు పాదాభివందనం చేసేవారు. పాదాభివందనం చేస్తున్న ఏ ఒక్కరినీ కూడా ఆమె వారించేవారు కాదు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోందని అంటున్నారు. అమ్మ స్థానంలో చిన్నమ్మకు కూడా పాదాభివందనాలు ప్రారంభమయ్యాయి.












Click it and Unblock the Notifications