తమిళనాట నడిరోడ్డుపై అన్నాడీఎంకే నేత హత్య, శశికళ సంతాపం
తమిళనాడులో పట్ట పగలు నడి రోడ్డు పైన అన్నాడీఎంకే పార్టీ నాయకుడిని హత్య చేశారు. కాపు కాసి మరీ అతనిని చంపేశారు. సహచరులతో ఆస్తి వివాదాలే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. రాజకీయ కారణాలు లేవు.
చెన్నై: తమిళనాడులో పట్ట పగలు నడి రోడ్డు పైన అన్నాడీఎంకే పార్టీ నాయకుడిని హత్య చేశారు. కాపు కాసి మరీ అతనిని చంపేశారు. సహచరులతో ఆస్తి వివాదాలే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. రాజకీయ కారణాలు లేవు.
హత్యకు గురైన వ్యక్తి కనగరాజ్ (40). అతను అన్నాడీఎంకే పార్టీ తిరువన్నామలై నగర నాయకుడు. అతను కొద్ది నెలల క్రితం వరకు టౌన్ సెక్రటరీగా పని చేశాడు. ఆదివారం ఉదయం ఆయన రోడ్డు పైన వెళ్తుండగా ఆయుధాలతో వచ్చిన ముగ్గురు అతనిని చంపేశారు.
ఈ దాడికి రూ.3 కోట్ల లావాదేవీలు కారణమని గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. కనగరాజ్ ఉదయం పూట బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత బైక్ పైన ఇంటికి వస్తున్నాడు. ఈ సమయంలో ముగ్గురు కారులో వచ్చి ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.

అతనిని బైక్ పై నుంచి కింద పడేశారు. ఆ తర్వాత కత్తితో పొడిచి చంపేశారు. కనగరాజ్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కాగా, హత్య చేసిన వారు ప్రతిపక్ష డీఎంకే మద్దతుదారులుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆయన మృతి పట్ల అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ప్రగాడ సానుభూతి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్య చేసిన ముగ్గురు.. రూ.5 కోట్ల విలువ చేసే భూమిని కనగరాజ్‌కు ఏడాది క్రితం అమ్మారు. అతను దానిని మూడో పార్టీకి అమ్మాడు. కానీ, తాను భూమి కొన్న పై ముగ్గురికి మాత్రం అతను పూర్తిగా డబ్బులు ఇవ్వలేదు. పలుమార్లు అడిగారు. ఎంతకూ ఇవ్వకపోవడంతో వారు హత్య చేశారు.












Click it and Unblock the Notifications