వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు సీఎంగా శశికళ: ఫిబ్రవరి 6 ముహూర్తం ! పన్నీర్ ?

అన్నాడీఎంకే పార్టీ చీఫ్ శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ఫిబ్రవరి 6వ తేది ముహూర్తం ఖరారైయ్యింది. ఫిబ్రవరి 5 ఆదివారం నవమి కావడంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందరూ చెన్నైకి రావాలని.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి, జయలలిత నెచ్చెలి శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముహూర్తం ఖరారైయ్యింది. ఫిబ్రవరి 6వ తేది సోమవారం శశికళ తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని శనివారం ఆమె సన్నిహితులు చెప్పారు. అయితే, ఆ ప్రమాణ స్వీకారం చేసే తేదీలు 8 లేదా 9 కూడ కావచ్చుననే మాట వినిపిస్తోంది.

<strong>శశికళ దిమ్మ తిరిగింది: నోటీసులు ఇచ్చిన ఎన్నికల కమిషన్</strong>శశికళ దిమ్మ తిరిగింది: నోటీసులు ఇచ్చిన ఎన్నికల కమిషన్

జయలలిత అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఏ పని చెయ్యాలన్నా జోతిష్యుల సలహాలు సూచనలు తీసుకునేవారు. అప్పటి నుంచి జయలలితను శశికళ ఫాలో అవుతున్నారు. తమిళనాడు సీఎంగా శశికళ పగ్గాలు చేపట్టడానికి జ్యోతిష్యుల సలహాలు, సూచనలు తీసుకున్నారు.

AIADMK MLAs meeting to be held on February 05 at party head office

సప్తమి, అష్టమి, నవమి రోజులు పూర్తి అయిన తరువాత మీకు మంచి రోజులు వస్తాయని జ్యోతిష్యులు శశికళకు చెప్పారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 5 నవమి రోజు (ఆదివారం) అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందరూ చెన్నై రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందరూ శశికళ సీఎం కావాలని ఓ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. సీఎంగా చిన్నమ్మకు బాధ్యతలు అప్పగిస్తున్నామని ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నారు.

మొత్తం మీద శశికళ ఫిబ్రవరి 6వ తేదీ సోమవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నాడీఎంకే పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. ఇదే జరిగితే తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు ఏ పదవి ఇస్తారు ? ఆయన రాజీనామా చెయ్యడానికి అంగీకరిస్తారా ? లేదా ? అనే విషయం తెలియడం లేదు.

English summary
AIADMK general secretary Sasikala Natarajan would swear in as Tamil Nadu chief minister before Thai Poosam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X