రాష్ట్రపతితో అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు భేటీ: గవర్నర్ పై ఫిర్యాదు !

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం చెయ్యకుండా గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు

న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం చెయ్యకుండా గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు, శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలు బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చెయ్యాలని సిద్దం అయ్యారు.

న్యూఢిల్లీలో అన్నాడీఎంకే ఎంపీలు మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను మా పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని, ఈ విషయం గవర్నర్ విద్యాసాగర్ రావుకు సమాచారం ఇచ్చామని అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు చెప్పారు. అయితే ఆయన ఎందుకో తమిళనాడు వైపు కన్నెత్తికూడా చూడటం లేదని ఎంపీలు ఆరోపించారు.

AIADMK MPs to meet Pranab Mukherjee to complain against Gov Vidyasagar Rao for delaying Sasi's oath taking

వెంటనే గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకుని శాసన సభ్యుల అభిప్రాయాలను గౌరవించి శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యడానికి అవకాశం కల్పించాలని మీరు సూచించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మనవి చేస్తామని అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు మీడియాకు చెప్పారు.

బుధవారం పార్టీ అధినేత్రి శశికళతో భేటీ అయిన తరువాత అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు (శశికళ వర్గం) ప్రత్యేక చెయ్యడానికి అవకాశం కల్పించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మనవి చేయనున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+