వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దినకరన్ కు శరత్ కుమార్ మద్దతు, నమూనా శవపేటికతో సెల్వమిలా...

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకపరిణామం చోటుచేసుకొంది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ అన్నాడిఎంకె శశికళ వర్గానికి మద్దతును ప్రకటించారు.ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నా

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకపరిణామం చోటుచేసుకొంది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ అన్నాడిఎంకె శశికళ వర్గానికి మద్దతును ప్రకటించారు.ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం విపరీత పోకడలతో ప్రచారానికి దిగింది.జయలలిత శవపేటీక నమూనాను ఎన్నికల ప్రచారంలో ఉపయోగిస్తోంది.

తమిళనాడు రాష్ట్రంలోని ఆర్ కె నగర్ ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో శరత్ కుమార్ శశికళ వర్గానికి మద్దతును ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

తమిళనాడులో అన్నాడిఎంకె సంక్షోభం సమయంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి మద్దతుగా సినీ పరిశ్రమ నిలిచింది.అయితే శరత్ కుమార్ తాజాగా శశికళ వర్గానికి మద్దతిస్తున్నట్టు ప్రకటించారు.

ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 12వ, తేదిన ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను అదికార, విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.

శశికళకు జై కొట్టిన శరత్ కుమార్

శశికళకు జై కొట్టిన శరత్ కుమార్

అన్నాడిఎంకె శశికళ వర్గానికి ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ మద్దతును ప్రకటించారు.శశికళ అల్లుడు టీటీవి దినకరన్ ను ఆయన అండగా నిలిచారు. గురువారం నాడు దినకరన్ ను కలిసి ఆయన సంఘీభావం తెలిపారు.ఈ స్థానానికి ఈ నెల 12, తేదిన ఎన్నికలు జరగనున్నాయి.

మాతృసంస్థకు దగ్గరైన శరత్ కుమార్

మాతృసంస్థకు దగ్గరైన శరత్ కుమార్

గతంలో అన్నాడీఎంకెకు మద్దతుదారుడిగా శరత్ కుమార్ ఉన్నారు. అయితే కొన్ని కారణాలతో ఆయన పార్టీకి దూరమయ్యారు.ఆ సమయంలో ఆయన డీఎంకె టిఎంసి కూటమికి ఆయన మద్దతును ప్రకటించారు.అంతేకాదు 2007 లో ఆయన స్వంత పార్టీని ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి పేరుతో పార్టీని ఏర్పాటు చేసినా , ఆ పార్టీ వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు.దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఆర్ కె నగర్ ఉప ఎన్నికలో అమీతుమీకి అధికార విపక్షాలు

ఆర్ కె నగర్ ఉప ఎన్నికలో అమీతుమీకి అధికార విపక్షాలు

ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అమీతుమీకి అధికార అన్నాడిఎంకె, విపక్ష డిఎంకెలు సన్నద్దమయ్యాయి.అయితే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం నుండి మధుసూధన్ కూడ బరిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో అధికార అన్నాడిఎంకె కు ఎన్నికల గుర్తు దక్కలేదు. టీటీవి దినకరన్ బరిలో ఉన్నారు.జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడ బరిలో నిలిచారు.

జయలలిత శవపేటీకతో దినకరన్ ప్రచారం

జయలలిత శవపేటీకతో దినకరన్ ప్రచారం

ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం విపరీత ప్రచారానికి దిగింది. జయలలిత శవపేటీక నమునాతో ఓట్లు అభ్యర్థించడం ప్రారంభించింది.అమ్మ ఇమేజ్ ను క్యాష్ చేసుకొనేందుకు విపరీత ప్రచారానికి దిగింది.అయితే దినకరన్ వర్గానికి చెందిన వారు ఓటర్లకు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు.

English summary
The AIADMK faction led by O Pannerrselvam was on Thursday seen campaigning for the upcoming Radhakrishnan Nagar bypoll with a replica of former Tamil Nadu Chief Minister Jayalalithaa’s mortal remains. In the picture tweeted by news agency ANI, residents of the constituency can be seen paying homage to the departed leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X