క్యూ కట్టేశారు: పన్నీర్ సెల్వంకు అన్నాడీఎంకే సీనియర్ నేతలు మద్దతు
అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్)కు అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ వ్యవస్థాపకులులో ఒకరైన తమిళనాడు మాజీ స్పీకర్, ప్రముఖ న్యాయవాది పీహెచ్.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం చెయ్యడాన్ని అడ్డుకుంటున్న ఆ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు అన్నాడీఎంకే సీనియర్ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఎలాగైనా శశికళను అన్నాడీఎంకే చీఫ్ పదవి నుంచి కూడా తప్పించాలని పావులుకదుపుతున్నారు.
అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్)కు అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ వ్యవస్థాపకులులో ఒకరైన తమిళనాడు మాజీ స్పీకర్, ప్రముఖ న్యాయవాది పీహెచ్. పాండియన్, మాజీ మంత్రి క్రిష్ణగిరికి చెందిన కేపీ. మునిసామితో పాటు పలువురు సీనియర్ నాయకులు బుధవారం పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు.
జయలలిత కేసులు వాదిస్తూ పీహెచ్. పాండియన్ అమ్మకు సన్నిహిడయ్యారు. జయలలిత కేసులు, అన్నాడీఎంకే పార్టీకి చెందిన నాయకుల కేసులు అన్నీ దాదాపుగా పీహెచ్. పాండియన్ వాదించారు. జయలలిత ఉన్న సమయంలోనే శశికళను పాండియన్ వ్యతిరేకించారు.

జయలలిత మరణించిన తరువాత శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకించిన వీరందరూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. శశికళ మీద పన్నీర్ సెల్వం తిరుగుబాటు చెయ్యడంతో ఇప్పుడు పార్టీలోని అసమ్మతి నేతలు అందరూ ఏకం అవుతున్నారు.
ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు జయలలిత మేనకోడలు దీపాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు వారందరూ పన్నీర్ సెల్వం గూటికి చేరుతున్నారు. బుధవారం పన్నీర్ సెల్వం వర్గంలోకి అన్నాడీఎంకే పార్టీ నేతలు అందరూ క్యూ కడుతున్నారు.
శశికళకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు అందరూ ఇప్పుడు ఏకం కావడంతో శశికళ వర్గీయులు హడలిపోతున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం ? అని శశికళ వర్గంలోని నాయకులు ఆలోచిస్తున్నారు. వీరికి తోడుగా ఇప్పుడు జయలలిత మేనకోడలు దీపా కలిస్తే శశికళ పరిస్థితి తల్లకిందలు అయిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications