ఆయనో ‘వడివేలు’, పేరెత్తడమే ఇష్టం లేదు: సెల్వంపై సీఆర్ సరస్వతి ఫైర్
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంపై అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంపై అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సెల్వంను కామెడియన్ వడివేలుతో పోలుస్తూ విమర్శలు చేశారు. తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితను నమ్మినవాళ్లంతా ఇప్పుడు శశికళ వెంటే ఉన్నారని చెప్పారు.

అన్నాడీఎంకే కార్యాలయమే తమ ఇల్లని, పన్నీరు సెల్వం ఎత్తడమే తమకు ఇష్టం లేదని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం గురించి చిన్నమ్మ మాట్లాడతారనితెలిపారు.
ఇన్నాళ్లుగా పన్నీరు సెల్వం మంచివాడే అనుకున్నామని, కానీ ఇంత స్వార్థపరుడని ఇప్పుడే తెలిసిందని అన్నారు. తమిళ హాస్యనటుడు వడివేలులా తయారయ్యారని సెల్వంపై ధ్వజమెత్తారు. నిజంగా అమ్మకు ఆయన విశ్వాసపాత్రుడే అయితే.. శశికళకు అడ్డురాకూడదని అన్నారు.












Click it and Unblock the Notifications