వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాడీఎంకే పార్టీ సింబల్ కేసు: సుప్రీం కోర్టును ఆశ్రయించిన శశికళ వర్గం, గంట ముందు !

అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం ఫైట్సమయం కావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన టీటీవీ దినకరన్ఎన్నికల కమిషన్ రెండాకుల చిహ్నం కేటాయించే గంట ముందు సుప్రీం కోర్టులో ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కేటాయించే విషయంలో మా వాదనలు వినిపించడానికి సమయం కావాలని, అంతవరకు పార్టీ సింబల్ ఎవ్వరికీ కేటాయించరాదని ఆపార్టీ (అమ్మ) నాయకుడు టీటీవీ దినకరన్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

శుక్రవారం టీటీవీ దినకరన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం. కన్వింకర్, జస్టిస్ డీవై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ టీటీవీ దినకరన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. శుక్రవారం మద్యాహ్నం రెండు గంటలకు పిటిషన్ విచారణ చేస్తామని సుప్రీం కోర్టు చెప్పింది.

AIADMK symbol case: Supreme Court to hear TTV Dinakaran plea

టీటీవీ దినకరన్ న్యాయవాది వీ. సింగ్ మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కేటాయించే విషయంలో అఫిడవిట్లు సమర్పించడానికి నా క్లైంట్ సమయం అడుగుతున్నారని చెప్పారు. ఇప్పటికే టీటీవీ దినకరన్ 20,000 అఫిడవిట్లు సమర్పించారని గుర్తు చేశారు.

అన్నాడీఎంకే పార్టీ సింబల్ కేటాయించే విషయంలో పార్టీలోని కొందరు నాయకులను ప్రశ్నించి వివరాలు సేకరించవలసి ఉందని టీటీవీ దినకరన్ న్యాయవాది వీ. సింగ్ అన్నారు. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం శుక్రవారం (అక్టోబర్ 6వ తేది) మద్యాహ్నం 3 గంటలకు ఏదో ఒక వర్గానికి కేటాయిస్తామని ఎన్నికల కమిషన్ గత నెలలో చెప్పింది. రెండాకుల చిహ్నం కేటాయించే నిర్ణయం తీసుకునే గంట ముందు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఇరు వర్గాలు ఎలాంటి నిర్ణయం వస్తుందో అంటూ టెన్షన్ తో ఎదురుచూస్తున్నారు.

English summary
TTV Dinakaran moved Supreme court seeking ban to hear admk two leaves symbol at Election comission of India today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X