aimim asaduddin owaisi vaccine hyderabad telangana ఏఐఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ తెలంగాణ politics
వ్యాక్సిన్ తీసుకున్న అసదుద్దీన్ ఓవైసీ -కొవిడ్ టీకాలపై ఎంఐఎం చీఫ్ కీలక సందేశం
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృదమవుతుండగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అంతే వేగంగా సాగుతున్నది. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 45ఏళ్లు దాటి వివిధ వ్యాదులతో బాధపడేవాళ్లతోపాటు ప్రజాప్రతినిధులు, కొవిడ్ వారియర్లు అందరికీ ప్రస్తుతం టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఆ క్రమంలోనే ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు.
51 ఏళ్ల అసదుద్దీన్ ఓవైసీ సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొవిషీల్డ్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. టీకా తీసుకున్నట్లు తన ట్విట్టర్‌లో పోస్టు పెట్టిన ఆయన.. వ్యాక్సిన్ వల్ల మనల్ని మనం కాపాడుకోవడంతోపాటు ఇతరులకూ ప్రమాదాన్ని తగ్గించినవాళ్లమవుతామని, అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే షెడ్యూల్ రూపొందించుకుని, టీకాలను పొందాలని ఓవైసీ కోరారు. మహమ్మారి నుంచి అల్లాహ్ మనల్ని కాపాడుతాడని ఆయన పేర్కొన్నారు.

వ్యాక్సిన్లపై కేంద్రం సంచలన ప్రకటన -కొవిషీల్డ్ రెండో డోసు గ్యాప్ 8వారాలకు పెంపు -ఎందుకంటే
కొవిడ్ వ్యాక్సిన్ల విషయంలో ముందు నుంచీ పాజిటివ్ ప్రకటనలు చేస్తూ వచ్చిన ఓవైసీ.. గత నెలలో ప్రధాని మోదీ టీకా తీసుకున్న సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ, టీకాల ధరలను ఇంకాస్త తగ్గించాలని, పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తేవాలని కోరారు. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం ఇప్పటిదాకా దేశంలో 4.5 కోట్ల మంది కోవిడ్ టీకా తీసుకున్నారు. ఇదిలా ఉంటే..
హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా కొవిడ్-19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. మళ్లీ లాక్ డౌన్ విధిస్తారంటూ ప్రచారం జరుగుతుండగా, వైద్య శాఖ అధికారి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్, కర్ఫ్యూ ప్రపోజల్ లేదన్నారు. విద్యాసంస్థల్లో కేసులు వస్తున్నాయని, విద్యార్థుల ద్వారా ఇంట్లోని వృద్ధులు.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రమాదమని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూ