ఏయిర్ ఏషియా విమానానిక బాంబు బెదిరింపు..
పశ్చిమబెంగాల్‌లో 179 మందితో వెళుతున్న ఎయిర్ ఏషియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్‌లోని బగ్డోగ్రా నుండి కొల్‌కతాకు వెళుతున్న ఎయిర్ ఏషియాకు చెందిన ఐ5-588 విమానానికి సంబంధించి బెంగళూర్ విమానాశ్రానికి ఫోన్ చేసి చెప్పారు. అయితే అప్పటికే విమానం బగ్డోగ్రా నుండి కోల్‌కతా బయలుదేరి వెళ్లింది.

దీంతో అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ అధికారులు విమానం కోల్‌కతా చేరుకోగానే హుటాహుటిన విమానంలో ఉన్న ప్రయాణికులను దింపివేశారు. ప్రయాణికులను సురిక్షితంగా పంపించిన తర్వాత విమానాన్ని ఓ ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్లి సోదాలు నిర్వహిస్తున్నారు.బాంబు బెదిరింపు సంబంధించి ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీఐఎస్ఎఫ్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications