రాజస్తాన్ లో కూలిన మిగ్ 21 యుద్ధ విమానం..ముగ్గురు గ్రామస్తులు దుర్మరణం
రాజస్తాన్ లోని హనుమాన్ ఘర్ లో ఇవాళ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారత వాయుసేనకు చెందిన మిగ్ -21 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలను చనిపోయినట్లు తెలుస్తోంది. సూరత్ ఘర్ నుంచి బయలుదేరిన ఈ విమానం హనుమాన్ ఘర్ ప్రాంతంపై నుంచి వెళ్తుండగా కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ ఫోర్స్ అధికారులు సహాయక చర్యలపై దృష్టిపెట్టారు.

#WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. The aircraft had taken off from Suratgarh. The pilot is safe. More details awaited: IAF Sources pic.twitter.com/0WOwoU5ASi
— ANI (@ANI) May 8, 2023
రాజస్తాన్ లోని హనుమాన్ ఘర్ లో మిగ్ 21 కూలిన ఘటనలో ఈ గ్రామానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. అయితే విమాన పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. సూరత్ ఘర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం కారణంగా విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని ముందే ఊహించిన పైలట్ పారాచూట్ సాయంతో దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు.
పైలట్ కొద్దిపాటి గాయాలతో బయటపడినట్లు ఎయిర్ ఫోర్స్ వర్గాలు ప్రకటించాయి. అతన్ని స్ధానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరుగుతుందని తెలిసి పైలట్ చాకచక్యంగా గ్రామం బయటకు విమానాన్ని నడిపినట్లు అధికారులు తెలిపారు. దీంతో భారీగా ప్రాణనష్టం తప్పినట్లు తెలిపారు. అదే గ్రామంలో ఇళ్లపై ఇది కూలి ఉంటే మరింత మంది మృత్యువాత పడే వారని తెలుస్తోంది.
మరోవైపు మిగ్ 21 ప్రమాద ఘటన తెలియగానే రాష్ట్ర పోలీసులతో పాటు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎయిర్ ఫోర్స్ వేర్వేరు విచారణలకు ఆదేశించాయి. సాంకేతిక లోపంతోనే మిగ్ 21 కూలినట్లు ప్రాథమికంగా గుర్తించినా ఇతర కోణాల్లోనూ దర్యాప్తు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో మిగ్ 21 ప్రమాదాన్ని ఎయిర్ ఫోర్స్ కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
తెలంగాణ డిస్కంలకు సింగరేణి ఊహించని షాక్.. రాజస్థాన్ కు కరెంట్ విక్రయం! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications